Nagababu: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగబాబు కామెంట్స్!

Ad not loaded.

మెగా బ్రదర్ నాగబాబుకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం నాగబాబు కామెడీ స్టార్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తుండగా ఈ షో రేటింగ్స్ క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది నాగబాబు బంగార్రాజు, సర్కారు వారి పాట సినిమాలలో చిన్న పాత్రలలో కనిపించగా ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. అయితే నాగబాబు తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

నాగబాబు ఆ ట్వీట్ లో నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు.. నువ్వు బ్రతికి ఉన్న సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్న సెన్స్ కానీ జ్ఞానం కానీ నాకు లేవని పేర్కొన్నారు. సెన్స్, జ్ఞానం వచ్చాయనుకున్న సమయంలో నువ్వు లేవని నాగబాబు కామెంట్లు చేశారు. దయచేసి చెబుతున్నానని ఆత్మీయులు బ్రతికి ఉన్న సమయంలోనే ఎమోషన్స్ పంచుకోవాలని నాగబాబు అన్నారు. తండ్రి ఫోటోను షేర్ చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ ను పోస్ట్ చేశారు.

నాగబాబు ట్వీట్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్వీట్ కు ఏకంగా 5500కు పైగా లైక్స్ వచ్చాయి. నాగబాబు తండ్రి కొణిదెల వెంకట్రావు పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. మరోవైపు నాగబాబు జనసేన పార్టీ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. 2024లో ఏపీలో ఆ పార్టీని అధికారంలోకి అధికారంలోకి తీసుకొనిరావాలని నాగబాబు కష్టపడుతున్నారు.

తాజాగా జనసేన నాయకులతో సమావేశం నిర్వహించిన నాగబాబు ఏపీని కాపాడుకోవడానికి జనసేనను గెలిపించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయని నాగబాబు కామెంట్లు చేశారు. జనసేన కోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని నాగబాబు తెలిపారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus