బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మెగా పార్టీ ఇచ్చిన నాగబాబు… వైరల్ అవుతున్న వీడియో..!

తెలుగు నాట ‘బిగ్ బాస్’ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సామాన్యుల దగ్గర నుండీ సెలబ్రిటీల వరకూ ఈ షోకి పెద్ద ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి లేదు. హౌస్లో ఉన్న వాళ్లందరినీ తమ ఇంటిసభ్యులుగా ట్రీట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పటివరకూ తెలుగులో నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. కరోనా కారణంగా.. ఈసారి నాలుగవ సీజన్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ… ఎంటర్టైన్మెంట్ కు మాత్రం.. ఏ విధమైన లోటు తలెత్తలేదు.

ఇక ఫినాలే ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా.. తాజాగా బిగ్ బాస్4 కంటెస్టెంట్ లకు నాగబాబు కూడా స్పెషల్ పార్టీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీకి ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్లు అయిన..అఖిల్‌, సోహెల్‌, మెహ‌బూబ్, అరియానా, లాస్య, హారిక‌, నోయ‌ల్‌, సుజాత‌, అవినాష్ వంటి వారు హాజరయ్యారు. అంతేకాదు ఇదే వేడుకలో సుజాత బర్త్ డే ను కూడా జరిపించారు నాగబాబు.

‘బిగ్ బాస్4′ కంటెస్టెంట్ అవినాష్ తో నాగబాబుకి మంచి సాన్నిహిత్యం ఉంది.ఇక ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోని కూడా నాగబాబు తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు.’ ‘బిగ్ బాస్ 4′ లో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు, 106 రోజుల పాటు ఒక ఇంట్లో టీవీ, మొబైల్, పుస్తకాలు లేకుండా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది చాలా కష్టం’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.


2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus