Nagarjuna: ఘనంగా నాగార్జున 63వ పుట్టినరోజు సెలబ్రేషన్స్..వైరల్ అవుతున్న ఫోటోలు !

నిన్న(ఆగస్టు 29న) ‘కింగ్’ నాగార్జున పుట్టినరోజు. దీంతో సెలబ్రిటీలతో పాటు అభిమానులంతా ఆయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేశారు. ఇందుకు నాగార్జున కూడా సంతోషం వ్యక్తం చేస్తూ..’ఉదయం నుండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెస్ వస్తున్నాయి. అలాగే ఫోన్ కు నాన్ స్టాప్ గా మెసేజ్ లు, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఫోన్లు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందుకు నేను కృతజ్ఞుడను. సెప్టెంబర్ మరియు అక్టోబర్లో మూడు ప్రాజెక్టులతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను’ అని హామీ ఇచ్చారు.

‘బిగ్ బాస్ 6’ తో పాటు ‘బ్రహ్మాస్త్ర’ ‘ఘోస్ట్’ వంటివి ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయి అని నాగార్జున ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకను ఆయన తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే సింపుల్ గా జరుపుకున్నారు. ఇది నాగార్జునకు 63 వ పుట్టినరోజు వేడుక. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు అఖిల్ మరియు అమల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus