Nagarjuna: ఆ విషయంలో అజిత్ ని ఫాలో అవుతున్నా!

మన హీరోలు వయసు ఎంత పెరుగుతున్నా.. కుర్రాళ్ల మాదిరి కనిపించడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. కొత్త కొత్త హెయిర్ స్టైల్స్, మేకప్స్ తో తమ ఏజ్ ని కవర్ ని చేస్తుంటారు. కానీ కోలీవుడ్ లో హీరో అజిత్ మాత్రం అలా కాదు. ఆయన బయట ఎలా ఉంటారో సినిమాలో కూడా అలానే కనిపించడానికి ఇష్టపడతారు. నెరిసిన జుట్టుతోనే తన సినిమాల్లో నటిస్తారు. మేకప్ జోలికి అసలు వెళ్లరు. తన వయసుకి తగ్గ పాత్రలనే ఎన్నుకుంటారు. అందుకే తమిళనాట అజిత్ అంటే విపరీతమైన అభిమానం.

ఇప్పుడు ఈ విషయంలో అజిత్ ని ఫాలో అవుతున్నాడు సీనియర్ హీరో నాగార్జున. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగార్జున సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారట. అసలు ఏ మాత్రం మేకప్ లేకుండా కనిపిస్తారట. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా వెల్లడించారు. అజిత్ మేకప్ లేకుండా నటిస్తుంటాడని.. ఈసారి తను కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చే సినిమాలో.. మేకప్ జోలికి వెళ్లడం లేదని.. సహజంగా కనిపించబోతున్నట్లు చెప్పారు. హెయిర్ కలర్ కూడా వేసుకోనని.. ఆ పాత్ర అంతలా స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ప్రస్తుతం నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ్.. ప్రవీణ్ సత్తారు సినిమా గురించి మాట్లాడారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus