రణబీర్, కత్రినా కైఫ్ లతో నాగ్-అమల దసరా సెలబ్రేషన్స్!

ఈ ఏడాది దసరా పండగను మన సెలబ్రిటీలంతా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. కింగ్ నాగార్జునకి ఈ దసరా పండగ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా దసరా రోజే విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాది దసరా పండగను పలువురు నటీనటులతో కలిసి జరుపుకున్నారు.

కళ్యాణ్ జ్యువల్లర్స్ సంస్థ అన్ని భాషల్లో తమ నగలను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలను ఒక దగ్గరకు చేర్చి దసరా వేడుకలు నిర్వహించింది. కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, స్నేహ, కళ్యాణి ప్రియదర్శన్, అమల, నాగార్జున ఇలా అందరూ కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగార్జున తన తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. ‘గాడ్ ఫాదర్’ ఫేమ్ దర్శకుడు మోహన్ రాజా..

నాగార్జునతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని అటు నాగార్జున, ఇటు మోహన్ రాజా ఇద్దరూ వెల్లడించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇందులో అఖిల్ కూడా కనిపించనున్నారు.

1

2

3

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus