Bigg Boss 8: ‘బిగ్ బాస్ 8’ హోస్ట్ పై క్లారిటీ వచ్చేసిందిగా.!

నార్త్ తర్వాత బిగ్ బాస్ ఎక్కువగా సక్సెస్ అయ్యింది తెలుగులోనే అని చెప్పాలి. ఎందుకంటే ముంబై తర్వాత గాసిప్స్ ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది తెలుగు వాళ్ళే కాబట్టి..! అవును కొంతమంది జనాలు ఒకచోట చేరి చేసే పనులను మన వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా గమనిస్తారు. అలాంటప్పుడు వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కంటెస్టెంట్లుగా హౌస్ ప్రవర్తించే విధానాన్ని వాళ్ళు గమనించకుండా ఉంటారా. అందుకే బిగ్ బాస్ తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.

Bigg Boss 8

బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, సీక్రెట్ టాస్కులు, ఒక కంటెస్టెంట్ పై మరొక కంటెస్టెంట్ చెప్పే చాడీలు, వీకెండ్ వచ్చిందంటే హోస్ట్.. కంటెస్టెంట్లకి పీకే క్లాసులు వంటివి ఇక్కడి జనాలను అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే 7 సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. కానీ ‘8వ సీజన్ కి పెద్దగా హడావిడి చేయడం లేదు బిగ్ బాస్ నిర్వాహకులు’ అంటూ ఇప్పటివరకు అనేక చర్చలు జరిగాయి. ముఖ్యంగా ‘హోస్ట్ గా నాగార్జున (Nagarjuna) చేయడం లేదు’ అనే గాసిప్స్ కూడా ఎక్కువగా వినిపించాయి.

వాటన్నిటికీ ఓ ప్రోమోతో ఫుల్ స్టాప్ పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. అవును బిగ్ బాస్ 8 కి సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కమెడియన్ సత్య (Satya) సందడి చేశాడు. అలాగే హోస్ట్ నాగార్జున కూడా కనిపించి.. ‘ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ ఉండదు’ అంటూ ఓ మాస్ డైలాగ్ పలికారు. సో ‘బిగ్ బాస్ 8’ కి కూడా హోస్ట్ నాగార్జునే అని క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.

వివాదంలో చిక్కుకున్న బిత్తిరి సత్తి.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus