టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు ఎంతోమంది ఉన్నారు.. అందులో చాలామంది టాప్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. మరికొందరు సెకండ్ గ్రేడ్ హీరోలుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు వెళ్తున్నారు. సినీ ఇండస్ట్రీ విస్తరిస్తున్న కొద్ది ప్రభాస్, ఎన్టీఆర్ అల్లు అర్జున్ ,రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఇండియన్ స్టార్స్ గా వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక వీరి రెమ్యూనరేషన్ కూడా 100 కోట్లకు పైగా ఉంటుంది.
ఇంతవరకు బాగానే ఉంది అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మన హీరోలలో అత్యంత ధనవంతులు ఎవరు అని మీరు గెస్ చేయగలరా…అయితే వీళ్ళు ఈ జనరేషన్ హీరోస్ ఐతే కాదు.. ఆరు పదుల వయసులో కూడా ఇప్పుడు హీరోలకు దీటుగా నవమన్మధుడు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున.అక్కినేని నాగేశ్వరరావు సినీ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నాగార్జున ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే వామ్మో అనుకోకుండా ఉండలేరు.
ఏఎన్ఆర్ వారసుడిగా వచ్చిన తనదైన శైలిలో అభిమానులను సొంతం చేసుకుని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున. ఇక తన టాలెంట్ తో ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేశారు. యాక్టర్ గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా మరియు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ కి హోస్ట్ గా జీవితంలో పలు రకాల పాత్రలు పోషిస్తూ సక్సెస్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.వారసత్వంగా వచ్చిన ఆస్తి మరియు తన స్వశక్తితో సంపాదించిన ఆస్తి అంతా కలిపితే ప్రస్తుతం నాగార్జున ఆస్తుల విలువ అక్షరాల రూ. 3, 010 కోట్లు.
నాగార్జున తరువాత టాలీవుడ్ హీరోలలో నెక్స్ట్ అత్యంత ధనవంతుడు ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన స్వశక్తితో సినీ ఇండస్ట్రీలో ఎదగడమే కాకుండా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో పొజిషన్ కి వచ్చిన చిరంజీవి ఆస్తుల విలువ సుమారు రూ. 1, 650 కోట్లు ఉంటుందట.నెక్స్ట్ ప్లేస్ పవర్ స్టార్ రామ్ చరణ్ కి సొంతం.
ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు చెర్రీ. ఈ నేపథ్యంలో వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ ఒక్కొక్క సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం చెర్రీ ఆస్తి విలువ రూ. 1370 కోట్లు. ఇక చరణ్ తరువాత ప్రభాస్ ,మహేష్ బాబు ,ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ ,వెంకటేష్ లాంటి ప్రముఖ నటులు లిస్ట్ లో ఉన్నారు.