Nagarjuna: ఒకేసారి రెండు సినిమా సెట్స్‌లో నాగ్‌!

ఒకేసారి రెండు సినిమాలు చేయడం నాగార్జునకు పెద్ద కొత్తేం కాదు. గతంలో చాలా సినిమాలు ఇలా చేశాడు. అయితే ఇటీవల కాలంలో తగ్గిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ ఫీట్‌ మళ్లీ చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రవీణ్‌ సత్తారు సినిమా ప్రారంభించిన నాగార్జున… మోస్ట్‌ అవైటింగ్‌ సినిమా ‘బంగార్రాజు’ను కూడా మొదలెట్టేస్తాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 20న ముహూర్తం అని టాక్‌. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత ఈ ‘బంగార్రాజు’ సినిమా ముచ్చట బయటికొచ్చింది.

అప్పటి నుండి దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఆ సినిమా పని మీదే ఉన్నాడు. ఈలోగా నాగ్‌ వేరే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇన్నాళ్లు అంతా సిద్ధమైందట. అందుకే సినిమా ప్రారంభిస్తున్నారని టాక్‌. సినిమా కాస్టింగ్‌ చాలా రకాల పుకార్లు వచ్చినా ఆఖరు నాగార్జున, నాగచైతన్య ఫిక్స్‌ అయ్యారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోందని వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత అవునూ.. కాదూ అనే మాటలు వినిపించాయి.

సినిమా ప్రారంభం రోజు ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సినిమా కోసం హైదరాబాద్‌లో స్పెషల్‌ సెట్‌ని సిద్ధం చేస్తున్నారట. ముందుగా నాగార్జున, రమ్యకృష్ణపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video



ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus