Rajinikanth: ఆ టైటిల్ తో రజినీకాంత్ హిట్ సాధిస్తారా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నేళ్ల క్రితం వరకు వరుసగా విజయాలను సొంతం చేసుకోగా ఈ మధ్య కాలంలో అయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతూ ఆయనను అభిమానించే అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరుస్తున్నాయి. దర్శకుల ఎంపిక విషయంలో కూడా రజినీకాంత్ తప్పు చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం. రజినీకాంత్ గత సినిమా పెద్దన్న బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే రజినీకాంత్ తర్వాత సినిమా నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

Click Here To Watch NOW

నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన బీస్ట్ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. వరుణ్ డాక్టర్ సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ కు ఆ సినిమా సక్సెస్ తో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే రజినీకాంత్ నెల్సన్ కాంబినేషన్ మూవీకి బాస్ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. తెలుగులో చాలా సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా వీఎన్ ఆదిత్య డైరెక్షన్ లో బాస్ పేరుతో ఒక సినిమా తెరకెక్కింది.

నయనతార, శ్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బాస్ టైటిల్ తో నటించిన నాగ్ సినిమా ఫ్లాప్ కాగా రజినీకాంత్ ఈ టైటిల్ తో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. ఈ సినిమాలో రజినీకాంత్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. బాస్ టైటిల్ వల్ల అన్ని భాషల్లో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడుతుందని ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నారని బోగట్టా.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus