Nagarjuna: ‘ఏజెంట్‌’ సినిమాపై నాగార్జున కామెంట్స్‌.. వ్యాట్స్‌ హ్యాపెనింగ్‌ అంటూ ఫ్యాన్స్‌!

అఖిల్ సినిమాను నాగార్జున ఎందుకు పట్టించుకోవడం లేదు? ‘ఏజెంట్‌’ మీద ‘వైల్డ్‌ డాగ్‌’ రుస రుస అంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా బుసబుసలు కొట్టారు. సినిమా విడుదలకు వారం కూడా లేదు.. అయినా నాగార్జున ఆ సినిమా ప్రచారంలో కనిపించడం లేదు అనేది వారి మాట. అయితే వాటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ నాగార్జున ‘ఏజెంట్‌’ కోసం వచ్చేశాడు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. అయితే అందులో నాగ్‌ చేసిన కొన్ని కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

మలయాళ ప్రముఖ హీరో మమ్ముట్టి ఏదైనా కథ నచ్చి, అందులో నటిస్తే సినిమా హిట్‌ అయినట్టే అని నాగార్జున అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే చూడలేదని.. కానీ బాగుంటుందని చెప్పారు. దీంతో కొడుకు సినిమా, అందులోనూ భారీ అంచనాలు, డబ్బులు పెట్టి తీసిన సినిమా గురించి ఇంత చప్పగా మాట్లాడటం ఏంటి అనే చర్చ నడుస్తోంది. సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకానున్న నేపథ్యంలో నాగ్‌ ఇలా ఎందుకున్నారు అనే చర్చ నడుస్తోంది.

తెలుగు సినీ ప్రేక్షకులు గొప్పవాళ్లు. కొత్త నేపథ్యంలో మంచి కథను చెబితే మంచి విజయం అందిస్తారు. సురేందర్‌ రెడ్డి థ్రిల్లింగ్‌ స్పై మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ సినిమా గురించి చెప్పిన నాగ్‌… నేను ఈ చిత్రాన్ని చూడలేదు. సినిమా స్టోరీ కూడా తెలియదు. కానీ, బ్లాక్‌బస్టర్‌ అయ్యే అంశాలన్నీ సినిమాలో ఉన్నాయని తెలుసు అని చెప్పారు నాగ్‌. అయితే నాగార్జున మాటల వెనుక ఆంతర్యం ఏంటి అనే చర్చ మొదలైంది. సినిమా మీద నమ్మకంతో అన్నారా? లేక నమ్మకం లేక అన్నారా? అనేది తెలియడం లేదు.

అలాగే మమ్ముట్టి గొప్పతనం గురించి కూడా నాగ్‌ చెపక్పారు. కథ నచ్చి మమ్ముట్టిగారు ఈ సినిమాలో నటించారు. తల్లి చనిపోయినా తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారంటేనే ఆయన డెడికేషన్‌ గురించి అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక అఖిల్‌ గురించి చెబుతూ.. ‘అఖిల ఎనర్జీని ఇప్పుడు మీరు చూస్తున్నారు. మేం చిన్నప్పటి నుండీ చూస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇందులో సిక్స్‌ ప్యాక్ చేయడం చూసి.. ‘హమ్మయ్య.. మేం యంగ్‌గా ఉన్నప్పుడు ఇలాంటి సిక్స్‌ ప్యాక్‌ చేయాల్సిన అవసరం రాలేదు’ అని అనుకున్నాను అంటూ (Nagarjuna) నాగార్జున నవ్వేశారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus