అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిసోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పని చేసే విజయ్‌వర్మ అనే ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాతలు.. తరువాత థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 2న విడుదల తేదీని ఫిక్స్ చేశారు. కొన్ని రోజుల క్రితం సినిమా ట్రైలర్ ని విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వర్క్ చేశారు. అయితే ముందుగా తమన్ ని సంగీత దర్శకుడిగా అనుకోలేదట. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత అతడిని అడిగారట. తనకు ఖాళీ లేకపోయినా.. నాగ్ అడిగాడని తమన్ ఒప్పుకొని చాలా తక్కువ సమయంలో ఈ సినిమాకి అవుట్ పుట్ ఇచ్చాడట. ‘వైల్డ్ డాగ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టాకీ పార్ట్ అంతా పూర్తయిన తరువాత తమన్ ను మ్యూజిక్ చేయమని అడిగామని..
తనకు ఖాళీ లేకపోయినా.. తన కోసం ఒప్పుకున్నాడని నాగ్ చెప్పుకొచ్చాడు. టైమ్ లేకపోయినా కూడా క్వాలిటీ విషయంలో తమన్ కాంప్రమైజ్ కాలేదని.. ఒకటికి మూడు రకాల ట్రాక్స్ ఇచ్చాడని.. తమకు నచ్చే వరకు పని చేస్తూనే ఉన్నాడని నాగ్ చెప్పాడు. ఈ సినిమాకి రీరికార్డింగ్ ఎంతో ముఖ్యమని.. పైగా తమన్ మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడని.. సినిమాకి నేపధ్య సంగీతం మేజర్ హైలైట్ అవుతుందని నాగ్ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!