జనాలు థియేటర్లకు రావట్లేదంటే ఎంటర్టైన్మెంట్ చచ్చిపోయిందని కాదు..సీనియర్ జర్నలిస్ట్ కు నాగార్జున కౌంటర్!

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ది ఘోస్ట్’ మూవీ గ్లింప్స్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ గ్లింప్స్ లాంచింగ్ లో కింగ్ నాగార్జున ఓ సీనియర్ జర్నలిస్ట్ పై పరోక్షంగా వేసిన కౌంటర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. విషయంలోకి వెళ్తే.. ఓ సీనియర్ జర్నలిస్ట్ నాగార్జునని ఈ విధంగా ప్రశ్నించాడు.. ” ఆఫీసర్, వైల్డ్ డాగ్ వంటి చిత్రాలు చేసిన తర్వాత ఇప్పుడు ‘ది ఘోస్ట్’ చేస్తున్నారు. అలాగే ‘మనం’ ‘సోగ్గాడే..’ ‘బంగార్రాజు’ వంటి చిత్రాలు చేశారు.

ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారు? అంటూ నాగార్జునని అడిగాడు. అందుకు నాగార్జున.. ‘జనాలు ఎప్పుడు ఎలా ఏది యాక్సెప్ట్ చేస్తారు అనేది ఎవ్వరూ ఊహించలేరు. ‘వైల్డ్ డాగ్’ అనేది సెకండ్ వేవ్ ఎఫెక్ట్ టైంలో హాస్పిటల్ నిండా పేషేంట్లు నిండిపోయిన టైంలో రిలీజ్ అయ్యింది. అయినా ఆ సినిమా నెట్ ఫ్లిక్స్ లో 3 వారాలు ట్రెండింగ్లో నిలిచింది. ఆ సినిమా ఫలితంతో నేను హ్యాపీ. ఇక ఆఫీసర్ అంటారా.. నాతో ‘శివ’ చేసిన రాంగోపాల్ వర్మ చేసిన మూవీ అది. ‘శివ’ పెద్ద హిట్ అయ్యింది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు.

ఆఫీసర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే నాకు తెలీదు. నేను ‘నిన్నేపెళ్లాడట’ అనే సినిమా కృష్ణవంశీతో చేశాను బాగా ఆడింది. అదే దర్శకుడితో నేను ‘చంద్రలేఖ’ చేశాను జనాలు దాన్ని ఇంటికి పంపించారు. అది కూడా నేను ఊహించలేదు. అలాగే అన్నమయ్య నాతో రాఘవేంద్ర రావు గారు చేస్తాను అన్నప్పుడు నాకు భయం వేసింది. కానీ రాఘవేంద్ర రావు గారు నమ్మకం పెట్టుకుని చెయ్యి అన్నారు. చేశాను అది నా కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

మీరు కూడా ట్రైలర్ లు చూసి ఇది బాగుంది అని రివ్యూలు రాశారు కానీ అవి ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పలానా హీరో పనికిరాడు అని రాశారు అతను పెద్ద స్టార్ అయ్యి కూర్చున్నాడు. మీరు మాత్రం అవి ఊహించారా?’ అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. అలాగే మరో జర్నలిస్ట్.. ‘ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు.. చాలా మందికి పని ఉండటం లేదు ఎంటర్టైన్మెంట్ కు జనాలు దూరమవుతున్నారు అని మీరు అనుకుంటున్నారా?’ అంటూ అడిగాడు.

అందుకు నాగార్జున… ‘ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు చచ్చిపోదు అండి. జనాలు థియేటర్లకు రావడం లేదు అనడం కరెక్ట్ కాదు.ఈ టైంలో వాళ్ళు రాలేదు. మొన్నామధ్య కొన్ని సినిమాలు విపరీతంగా ఆడాయి కదా. కోవిడ్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? అంటే భాషతో సంబంధం లేకుండా జనాలు సినిమాలను చూడడం నేర్చుకున్నారు’ అని బదులిచ్చాడు’.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus