Nagarjuna, Samantha: సమంత ఎక్కడ అంటూ విజయ్ ని అడిగిన నాగార్జున!

మరి కొన్ని గంటలలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రసారంకాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో విజయ్ దేవరకొండ అలాగే నవీన్ పోలిశెట్టి హాజరు కాబోతున్నారు వీరిద్దరూ తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈ రొమ్ములు భాగంగా విజయ్ దేవరకొండను వేదిక పైకి ఆహ్వానించే సమయంలో ఆరాధ్య అనే సాంగ్ ప్లే చేస్తూ విజయ్ దేవరకొండను వేదిక పైకి నాగార్జున ఆహ్వానించారు. అయితే ఈయన వేదిక పైకి రాగానే నాగర్జున మీ హీరోయిన్ సమంత ఎక్కడ అంటూ మాజీ కోడలు గురించి ప్రశ్నించారు. ఇలా విజయ్ దేవరకొండ ను సమంత గురించి నాగార్జున అడగడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ నాగార్జున ఇంటికి కోడలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా నాగచైతన్య సమంతల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహం బంధం కొద్ది రోజులకి రద్దు కావడంతో సమంత అక్కినేని కుటుంబానికి దూరమయ్యారు. ఇలా నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని విడిపోయిన సమయంలో మాత్రమే సమంతా గురించి నాగార్జున మాట్లాడారు.

సమంత నాగచైతన్య ఇద్దరు పరస్పర అభిప్రాయం మేరకే విడాకులు తీసుకొని విడిపోతున్నారని అయితే సమంత ఎక్కడున్నా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన ఆ సమయంలో మాత్రమే స్పందించారు. అయితే తిరిగి సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఎప్పుడూ కూడా నాగార్జున తన మామయ్యగా కాకుండా ఒక సహా నటుడిగా తనను పలకరించలేదు అయితే మొదటిసారి బిగ్ బాస్ వేదికపై సమంత గురించి నాగార్జున అడగడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus