Nagarjuna:ప్రయోగాలకే ఓటేస్తున్న కింగ్ నాగార్జున.. కానీ?

కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత సోలో హీరోగా ఆ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదలైన బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించినా ఫుల్ రన్ లో ఈ సినిమా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితమైంది. బంగార్రాజు సినిమా కలెక్షన్లు నాగ్ స్థాయికి తగిన కలెక్షన్లు కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. సంక్రాంతికి పోటీ పెద్దగా లేకపోయినా నాగార్జున మాత్రం సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోలేకపోయారు.

Click Here To Watch NOW

సంక్రాంతి సినిమా అయిన బంగార్రాజు నైజాం ఏరియాలో అస్సలు ప్రభావం చూపలేదు. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నారు. నాగార్జునకు జోడీగా ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. తాజాగా ది ఘోస్ట్ మూవీ షూటింగ్ దుబాయ్ లో పూర్తైంది. దుబాయ్ షెడ్యూల్ లో సాంగ్, యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేశారని సమాచారం. నాగార్జున బంగార్రాజు సక్సెస్ ను ది ఘోస్ట్ మూవీతో కొనసాగిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రవీణ్ సత్తారు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు కావడంతో నాగార్జున అభిమానులు సైతం ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్లను మరింత ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది ఘోస్ట్ సినిమాకు ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ గా నిలవనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిట్ పోస్టర్ ను విడుదల చేయగా ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. గతంలోలా నాగ్ వరుసగా విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రయోగాత్మక సినిమాలకు ఓటు వేస్తున్న నాగ్ ఆ సినిమాలతో విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus