Nagarjuna: ఎన్నో జాగ్రత్తలు.. దగ్గరుండి రీ రికార్డింగ్, అయినా నాగ్ సినిమా ఎందుకు ఫ్లాప్..?

ఇప్పుడంటే తెలుగు సినిమాలో క్రియేటివిటీ, వినూత్న కథలకు ఇంపార్టెన్స్ పెరిగింది కానీ. ఒకప్పుడు మన సినిమా ఫక్తు కమర్షియల్ ఫార్ములానే మేళవించి తీసేవారు. ఆరు పాటలు, మూడు ఫైట్లు, కాస్త కామెడీ, ఒక సెంటిమెంట్ సీన్ తో సినిమా పూర్తయ్యేది. ఆడియన్స్ కూడా అలాంటివాటికే బ్రహ్మరథం పట్టడంతో దర్శక నిర్మాతలు కూడా అటు వైపే వెళ్లేవారు. కానీ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా మారుతోంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథలు తయారవుతున్నాయి.

అవసరమైతే ప్రయోగాలు చేసేందుకు సైతం హీరోలు, మేకర్స్ సైతం వెనుకాడటం లేదు. కానీ దశాబ్ధాల క్రితమే క్రియేటివిటీకి , ప్రయోగాలకు తెరదీశారు అక్కినేని నాగార్జున. మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు వేగాన్ని, ప్రయోగాలను రుచి చూపింది నాగ్. శివ నుంచి ఇప్పటి ఘోస్ట్ వరకు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు నాగార్జున. కానీ అన్ని సార్లు ప్రయోగాలు సక్సెస్ కావు కదా. అలా ఆయనకు ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. అందులో ఒకటి ‘క్రిమినల్’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేశ్ భట్ ను తెలుగు తెరకు పరిచయం చేశారు నాగార్జున.

వరుస బ్లాక్ బస్టర్లతో మంచి ఊపు మీదున్న మహేశ్ భట్.. తెలుగులో ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. నాగ్ సరసన రమ్యకృష్ణ, మనీషా కొయిరాల హీరోయిన్లుగా నటించారు. ప్యుజిటివ్ అనే ఆంగ్ల చిత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అందులోని కొన్ని సన్నివేశాలు క్రిమినల్ లో కనిపిస్తాయి. కథ, కథనం, పాటలు అన్ని బాగా కుదరడంతో నాగార్జున ఈ సినిమాపై మంచి నమ్మకంతో వున్నారు. గడ్డం పెంచడంతో పాటు మరో సినిమాకు కమిట్ కాకుండా క్రిమినల్ మీదే మనసు పెట్టారు.

అంతేకాదు.. రీ రికార్డింగ్ విషయంలోనూ ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. స్వయంగా రికార్డింగ్ థియేటర్ కు వెళ్లి పరిశీలిస్తూ వుండేవారు. అలా నాగార్జున ఎంతో నమ్మకం పెట్టుకుని, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ‘క్రిమినల్’ తెలుగు జనాలకు ఎక్కలేదు. కానీ ఈ చిత్రంలోని పాటలు మాత్రం ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఉపాయి. ముఖ్యంగా ‘‘తెలుసా మనసా’’ పాట ఆల్ టైమ్ ఫేవరేట్లో ఒకటి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus