బిగ్‌బాస్ అంటే ఫన్… బిగ్‌బాస్ అంటే ఎంజాయ్‌మెంట్.. బిగ్ బాస్ అంటే ఎమెషన్.. ఇదంతా ఆటను సీరియస్‌గా తీసుకుంటనే. అయితే నాలుగో సీజన్‌లో హౌస్‌మేట్స్ ఎవరూ గేమ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. ఒక్క ఎపిసోడ్ చూసినవాళ్లైనా ఈ విషయాన్ని చెప్పేస్తారు. అలాంటిది షోను హ్యాండిల్ చేస్తున్న నాగార్జున చెప్పలేడా? ఈ వారం అదే జరిగింది. అవును నాగార్జున హౌస్‌మేట్స్ ఫైర్ అయ్యాడు. అదీ అలా ఇలా కాదు.. కోపంతో ఊగిపోయాడు. ఇంతకీ ఏమైందంటే?
ఈ వారం నామినేషన్ విధానం పూర్తయినప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. అదేంటి నామినేషన్ ఇంత సులభంగా ముగిసిపోయింది అనుకున్నారు. ఏదో ఎమోషన్స్, డ్రామా, ఆరోపణలు లాంటివి ఉంటాయనుకున్నారు. అయితే ఎవరికివారు సెల్ఫ్ నామినేట్ అయిపోయారు. నేను దిగిపోతా అంటే నేను దిగిపోతా అంటూ పడవ దిగేశారు. దీనినే నాగార్జున పాయింట్ ఔట్ చేశారు. అసలు మీరు గేమ్‌ని సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నామినేట్ అయిన తొమ్మిది మందిని నిలబెట్టి కడిగిపారేశాడు.
‘నామినేషన్స్ తీసుకోమని బిగ్‌బాస్ చెప్పినా కూడా… వెటకారంగా ఓ పాట పాడిన నోయల్‌ను, దానికి కోరస్ పాడిన వాళ్లందరినీ వాగించేశాడు. ‘నీ ఆట నువ్వాడుకో… ఏంటిది’ అంటూ కొత్త కెప్టెన్‌కు చెమటలు పట్టించాడు. ఇక్కడ ఆడటానికి, గెలవడానికి వచ్చారు. అంతేకానీ సేఫ్ గేమ్ ఆడటానికి కాదు. ఇకపై ఇలా జరగనివ్వను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చూస్తుంటే ఈ రోజు ఇలాంటివి చాలా ఉండేలా కనిపిస్తోంది.