Nagarjuna, Shanmukh: నాగార్జున షణ్ముక్ కోసం స్టేజ్ పైన అలా అడిగేశాడు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ ఎవరు అనేది షో ప్రసారానికి ముందే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతేకాదు, అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం కూడా అందరూ సన్నీనే విన్నర్ అవుతారని ఊహించారు. అనుకున్నట్లుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ట్రోఫీని సన్నీకి ఇచ్చారు. ఇక్కడే సన్నీ కి ట్రోఫీతో పాటుగా 50 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్, సువర్ణకుటీర్ లో 300 గజాల సైట్ రెండూ వచ్చాయి.

అంతేకాదు, టివియస్ అపాచీ బైక్ ని సైతం సొంతం చేసుకున్నాడు సన్నీ. ఇది ప్రజెంట్ చేస్తున్న టైమ్ లో తన తల్లి కళావతిని సైతం స్టేజ్ పైకి తీస్కుని వచ్చి మురిసిపోయాడు సన్నీ. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. మరోవైపు షణ్ముక్ స్టేజ్ పక్కనే ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన నాగార్జున, విన్నర్ తో పాటుగా రన్నరప్ స్థానంలో ఉన్న షణ్ముక్ కి కూడా ఎంతోకొంత సైట్ ని ప్రజెంట్ చేయమని సువర్ణభూమి ఛైర్మన్ ని కోరారు.

దీంతో నాగార్జున మాట కాదనలేక, రన్నరప్ స్థానంలో ఉన్న షణ్ముక్ కి సైతం కొంత భూమిని ఇస్తానని అది ఆఫీస్ కి వచ్చి ఎనీటైమ్ తను కలెక్ట్ చేస్కోవచ్చని ప్రామిస్ చేశాడు. దీంతో షణ్ముక్ కొద్దిగా ఆనందపడ్డాడు. విజేతగా నిలిచిన సన్నీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు షణ్ముక్ సపోర్టర్స్ అందరూ కూడా తనని ఎంత కిందకి లాగాలని చూసినా కూడా రన్నరప్ గా నిలిచాడు. అదీ షణ్ముక్ స్టామినా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు, ఫస్ట్ నుంచీ కూడా బిగ్ బాస్ టీమ్ కావాలనే షణ్ముక్ ని బ్యాడ్ చేసేందుకు చూసిందని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక గెలిచిన ఆనందంలో షణ్ముక్ తన ఫ్రెండ్స్ తో కలిసి పండగ చేసుకున్నాడు. అదీ మేటర్.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus