Nagarjuna: ఆ రెండు సినిమాలు నాగార్జున చేసి ఉంటే ఇండస్ట్రీ నెం1 హీరో అయ్యేవాడు..!

  • August 22, 2023 / 06:09 PM IST

ఎప్పుడూ ఒకరి ఆలోచనలు మరొకరికి నచ్చవు.. అలాగే ఏ ఒక్కరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు.. ఇది సత్యం. ఇది సినిమా ఇండస్ట్రీకి కూడా తీసిపోదు. అందుకే ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా కథలు ఒకరి దగ్గరకు వెళ్తుంటాయి. అవి అలా ఆ హీరోకు ఒకసారి బంపర్ హిట్లు అవుతుండగా.. కొన్ని సార్లు అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి. ఇలాంటి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున విషయంలో కూడా జరిగింది. హీరో నాగార్జున సినీ కెరీర్‎లో రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేతులారా వదులుకున్నాడు.

మరి ఆ రెండు సినిమాలు ఏంటో తెలుసా? వాటిలో ముందుగా విక్టరీ వెంకటేష్- సిమ్రాన్ జంటగా నటించిన కలిసుందాం రా సినిమా. 2000వ సంవత్సరంలో రిలీజైనా ఈ సినిమా లవ్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వ‌చ్చి అప్పట్లో బాక్సాఫీసును కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వెంకటేష్ అన్న సురేష్ బాబు నిర్మించారు. నిజానికి ఈ సినిమాను ముందు నాగార్జున చేయాల్సి ఉందట.

సినిమా దర్శకుడు ఉదయ్ భాస్కర్ కథను ముందు (Nagarjuna) నాగార్జునకే చెప్పారట. కానీ అప్పటికే నాగార్జున ఫ్యామిలీ సినిమాలే వరుసగా చేస్తుండడంతో ఆ కథను సున్నితంగా తిరస్కరించారట. అలా నాగార్జున నుంచి కలిసుందాం రా.. వెంకటేష్ చేతిలోకి వచ్చింది. ఇంకా రెండోది.. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటికీ గుర్తుంచుకునే సినిమా.. గ్యాంగ్ లీడర్. దర్శకుడు విజయ బాపినీడు తెరకెక్కించిన సినిమాలో చిరంజీవికి జంటగా విజయశాంతి నటించింది.

1991 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి కూడా మొదట నాగార్జుననే అనుకున్నారట.. కానీ కొన్ని కారణాల చేత ఆ ఛాయిస్ చిరంజీవి దగ్గరకు వెళ్లిందట. ఈ విధంగా నాగార్జున తన కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus