టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) ఇతర సినిమాల్లో గెస్ట్ రోల్స్ స్పెషల్ రోల్స్ చేస్తున్నా కూడా హీరోగా తన తదుపరి సినిమా గురించి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల తమిళ దర్శకుడు నవీన్ తో సినిమా చేయబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇంకా అధికారిక ప్రకటన లేకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, స్క్రిప్ట్ విషయంలో నాగ్ పూర్తిగా సంతృప్తిగా లేరని, కొన్ని మార్పులు సూచించారని తెలుస్తోంది.
అయితే, దర్శకుడు నవీన్ ఆ మార్పులపై క్లారిటీ ఇవ్వలేదట. దాంతో నాగార్జున ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలా? వదిలేయాలా? అనే దిశగా ఆలోచనలో ఉన్నారట. కోలీవుడ్ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఇక నాగార్జున ఇప్పటికే కుభేర షూటింగ్ పూర్తి చేసారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కుభేర (Kubera) తర్వాత నాగ్ ఏ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అన్నదే అందరిలో ఆసక్తి పెంచుతోంది.
నవీన్ స్టోరీతో వెళ్తారా? లేక కొత్త దర్శకుడిని రంగంలోకి దింపుతారా? అన్నది ఇంకా తేలలేదు. ఇది మొదటిసారి కాదు. గతంలో రైటర్ ప్రసన్న కుమార్ తో (Prasanna Kumar) సినిమా ప్లాన్ చేసినా, స్క్రిప్ట్‌లో మార్పుల కారణంగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు నవీన్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో, నాగ్ కొత్త కథ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో అన్నది మిస్టరీగానే మారింది.
ప్రస్తుతం నాగార్జున కూలీ (Coolie) సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆ షూటింగ్ పూర్తవగానే, తన కొత్త ప్రాజెక్ట్‌పై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. మొత్తానికి, నాగ్ నెక్ట్స్ మూవీపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అభిమానులు మాత్రం ఆయన నుంచి పక్కా మాస్ మూవీ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.