Nagarjuna: తొందర లేదట.. అన్నీ అలోచించే చేస్తాడట!

నాగార్జున పెద్దగా నమ్మకం పెట్టుకోని సినిమాలు ఆడవు అంటారు. గతంలో చాలా సందర్భాల్లో ఆయనే చెప్పారు. అందుకేనేమో బాగా టైమ్‌ తీసుకొని నమ్మకంతో సినిమాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నారు నాగ్‌. ‘ది ఘోస్ట్‌’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్‌ ఆశించిన ఫలితం అందుకోలేకపోయారు. ఆ తర్వాత సినిమాలు కూడా అనౌన్స్‌ చేయలేదు. అయితే మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది అని మాత్రం సమాచారం ఉంది.

అయితే మోహన్‌రాజా సినిమా నాగ్‌ వందో చిత్రంగా ఉంటుంది అని అంటున్నారు. ఈ క్రమంలో నాగ్‌ లైనప్‌ గురించి ఆసక్తికరమైన సమాచారం వచ్చింది. ఎలాంటి కంగారు లేకుండా, అన్నీ ఆలోచించి సావధానంగా కొత్త సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు నలుగురు దర్శకుల కథలు లైన్‌లో ఉన్నాయట. అందులో ఏదో ఒకటి ఓకే చేస్తారని చెబుతున్నారు. నాగ్‌ లిస్ట్‌లో సీనియర్‌ దర్శకులతోపాటు, కొత్తతరం కథలు ఉన్నాయట. ముందుగా చెప్పినట్లు మోహన్‌రాజా లిస్ట్‌లో ఉన్నారు.

ఆయన కాకుండా విక్రమ్‌ కె.కుమార్‌ లాంటి క్రియేటివ్‌ డైరక్టర్‌ పేరు కూడా ఆ లిస్ట్‌లో ఉంది. ఇక డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్ కూడా నాగ్ కు ఓ కథ చెప్పారని ఆ మధ్య టాక్‌ వినిపించింది. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని టాక్‌. వీటిలో ఎవరో ఒకరితో వచ్చే ఏడాదిలో నాగ్‌ కొత్త సినిమా షురూ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

‘ఘోస్ట్‌’ సినిమా తర్వాత ఆరు నెలల గ్యాప్‌ తీసుకుంటానని నాగ్‌ ఇప్పటికే చెప్పారు. ఆ గ్యాప్‌ మార్చి కల్లా పూర్తవుతుంది. అంటే సమ్మర్‌లో కొత్త సినిమా ఉండొచ్చు. 2022ని ‘బంగార్రాజు’ సినిమాతో మొదలుపెట్టిన నాగార్జున ‘ది ఘోస్ట్‌’, ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాలతో వచ్చారు. తొలి సినిమా ఓకే అనిపించినా.. మిగిలిన రెండు నాగ్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. మరి కొత్త ఏడాదిలో నాగ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus