Nagarjuna: కరోనా వల్ల ఎనిమిది నెలలు బందీనయ్యా : నాగార్జున

ప్రతి స్టార్ హీరో కెరీర్ లో వందో సినిమా ఎంతో కీలకం అనే సంగతి తెలిసిందే. వందో సినిమాతో ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలనే ఉద్దేశంతో స్టార్ హీరోలు ఆ సినిమా హిట్ అయ్యే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున త్వరలో వందో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగార్జునకు వందో సినిమా గురించి ప్రశ్న ఎదురు కాగా నాగ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను వందో సినిమా కొరకు చాలా లెక్కలు వేసుకుంటున్నానని.. కేవలం హీరోగా చేసినవి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలా..? లేక అతిథి పాత్రలు చేసిన సినిమాలను కూడా కలపాలా..? అని ఆలోచిస్తున్నానని ఏ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తానో ఆ సినిమానే వందో సినిమాగా చేస్తానని నాగార్జున తన వందో సినిమా గురించి స్పష్టతనిచ్చారు. వైల్డ్ డాగ్ సినిమాలోని ఏసీపీ విజయ్ వర్మ పాత్ర నిజ జీవితంలో తన ఆలోచనలకు, అభిప్రాయాలకు దగ్గరగా ఉందని నాగార్జున అన్నారు. యాక్షన్ కథలను ఎంచుకోవడం గురించి నాగార్జున మాట్లాడుతూ తన వయస్సు ప్రస్తుతం 31 మాత్రమేనని ఫిట్ నెస్ కు తాను ఎక్కువగా ప్రాధాన్యతనిస్తానని తెలిపారు.

యాక్షన్ సినిమాలో నటించడం తనకు కష్టమేమీ కాలేదని.. షూటింగ్ సమయంలో చిన్నచిన్న ఇబ్బందులు మాత్రమే ఎదురయ్యాయని నాగ్ పేర్కొన్నారు. కరోనా వల్ల ఎనిమిది నెలలు బందీనయ్యానని నాగార్జున తెలిపారు. కొత్తగా సినిమా తీయడం వరకే తమ బాధ్యత అవుతుందని శివ మూవీలా వైల్డ్ డాగ్ ట్రెండ్ సెట్టర్ అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేనని నాగార్జున వెల్లడించారు. బ్రహ్మాస్త్ర సినిమా మూడు భాగాలుగా తెరకెక్కుతోందని ఆ సినిమాలో తన పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని నాగార్జున అన్నారు. ప్రస్తుతం ప్రవీణ సత్తారు డైరెక్షన్ లో యాక్షన్ సినిమాలో నటిస్తున్నానని నాగ్ వెల్లడించారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus