Nagarjuna, Geetu: గీతుని ఆట ఆడుకున్న నాగార్జున..! ఈ సీజన్ లో బిగ్ బాస్ స్ట్రాటజీ ఇదే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఫస్ట్ వీక్ గడిచిపోయింది. శనివారం నాగార్జున హౌస్ మేట్స్ ని పలకరించి సుతిమెత్తని క్లాస్ పీకాడు. నవ్వుతూనే నాలుగు వడ్డించాడు. ముఖ్యంగా గీతు విషయంలో సెటైర్స్ పడుతూనే ఉన్నాయి. మంచో, చెడ్డో నా పేరు వస్తోంది కదా అన్నట్లుగా గీతు ప్రతి విషయానికి నవ్వుతోంది. కన్నింగ్ గేమ్ అని పార్టిసిపెంట్స్ ఇచ్చినా కూడా మురిసిపోతోంది. అసలు ఈ గీతు ప్లాన్ ఏంట్రా బాబు అని బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ ఆలోచనలో పడ్డారు.

హౌస్ మేట్స్ కే కాదు, ఆడియన్స్ కి కూడా ఇరిటేషన్ తెప్పిస్తోంది గలాటే గీతు. నాగార్జున క్లాస్ పీకుతున్నా కూడా పాజిటివ్ గా తీస్కుంటూ రెచ్చిపోతోంది. అంతేకాదు, శనివారం ఎపిసోడ్ లో అభినయశ్రీతో ఫైట్ పెట్టుకుంది. ఇంతకీ ఈ అమ్మడి గేమ్ ప్లాన్ ఏంటంటే., హౌస్ మేట్స్ అందరిలో వ్యతిరేకత వస్తే ఆడియన్స్ నుంచీ సింపతీ వర్కౌట్ అవుతుందనే ప్లాన్ లో ఉంది. అదే విషయాన్ని గీతునే హౌస్ లో చెప్పింది కూడా.

హౌస్ మేట్స్ కాదు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అని, అలాగే, హౌస్ లో ఎవరితోనూ రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదని, హౌస్ లో ఎవరూ నాకు కుటుంబసభ్యులు కాలేరని నిర్మొహమాటంగా చెప్పింది. ఇదే విషయం పట్టుకుని నాగార్జున ఎపిసోడ్ మొత్తం గీతుని రోస్ట్ చేస్తునే ఉన్నాడు. కౌంటర్స్ వేస్తునే గీతుకి చెప్పే ప్రయత్నం చేశాడు.

అంతేకాదు, తిక్కలది అంటే స్లాంగ్ కాదని, అది తిట్టేనని నాగార్జున డిక్లేర్ చేశాడు. దీంతో హౌస్ మేట్స్ కి నామినేషన్స్ కి పాయింట్స్ దొరికినట్లు అయ్యింది. మొత్తానికి ఫస్ట్ వీక్ లోనే గలాటే గీతు ఆడియన్స్ నుంచీ కొంత నెగివిటిని మూట కట్టుకుంది. అంతేకాదు, హౌస్ లో అందర్నీ ఇరిటేట్ చేస్తుందని ఆమెది స్లాంగ్ కాదు ఓవర్ యాక్షన్ అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus