అక్కినేని నాగార్జున నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రం ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదలయ్యింది. అక్కడ పెద్దగా పెర్ఫార్మ్ చెయ్యలేదు. కానీ ఓటిటిలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది.నిజానికి ఈ చిత్రాన్ని మొదట ఓటీటీలోనే విడుదల చెయ్యాలి అనుకున్నాడు నాగ్. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వారు ఈ చిత్రానికి రూ.22 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చింది. దీనికి ‘వైల్డ్ డాగ్’ టీం మొదట ఓకే చెప్పి ఆ తరువాత థియేటర్ రిలీజ్ కు మక్కువ చూపించారు. కానీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ‘వైల్డ్ డాగ్’ కు వర్కౌట్ అవ్వలేదు.
దాంతో వెంటనే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో విడుదల చేశారు. ఇక్కడ మాత్రం ఈ చిత్రం లాభాలను మిగిల్చింది. దాంతో నాగార్జున తప్పు తెలిసికొని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘వైల్డ్ డాగ్’ తరువాత నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు.ఇది కూడా యాక్షన్ థ్రిల్లర్ మూవీనే..! అయితే ‘వైల్డ్ డాగ్’ తరువాత వెంటనే ఈ ప్రాజెక్టు చెయ్యడం కరెక్ట్ కాదని భావించి కొన్ని నెలలు పాటు దీనిని హోల్డ్ లో పెట్టాలని నాగార్జున డిసైడ్ అయ్యాడట. పైగా ఈ ప్రాజెక్టుకి రూ60 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి ఉందట.
అంతేకాదు ఓ ఏడాది పాటు టైం కేటాయించాలని కూడా తెలుస్తుంది. దాంతో నాగ్ ఈ టైములో ఓ పక్కా కమర్షియల్ మూవీ చేస్తే బెటర్ అని డిసైడ్ అయినట్టు ఇన్సైడ్ టాక్. ఈ నేపథ్యంలో ‘సోగ్గాడే చిన్ని నాయినా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి జూన్ లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి 3 నెలల్లోనే ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. నిజమే.. కరోనా టైంలో భారీ బడ్జెట్ సినిమాలు ఓకే చేస్తే చాలా సమస్యలు వస్తాయి. నాగార్జున ఈ విషయంలో మంచి డెసిషన్ తీసుకున్నాడనే చెప్పొచ్చు.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!