Nagarjuna: ‘సోగ్గాడే…’ సీక్వెల్ గురించి నాగ్‌ ఏమన్నారంటే?

‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా సీక్వెల్‌ వస్తుందా… గత కొద్ది రోజుల నుండి ఈ ప్రశ్న టాలీవుడ్‌లో, మీడియాలో వినిపిస్తూనే ఉంది. అదేంటి ‘బంగార్రాజు’ వస్తోంది కదా అంటారా? ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’కు ప్రీక్వెల్‌ అంటున్నారు. సినిమా ప్రచార వీడియోల్లో దీనిపై క్లారిటీ ఇవ్వకపోయినా ‘సోగ్గాడే..’కి ‘బంగార్రాజు’ ప్రీక్వెలే అని టాక్‌. దీంతో మరి సీక్వెల్‌ తీస్తారా అనే ప్రశ్న మొదలైంది. నాగార్జున ఎప్పుడైనా బయటకు వస్తే అడుగుదాంలే అని అనుకుంటుండగా… నిన్న వచ్చారు. సీక్వెల్‌ గురించి అడిగితే… సమాధానమిచ్చారు కూడా.

నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌… ముగ్గురూ కలసి నటిస్తే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి కాంబినేషన్‌లోనే ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌ వస్తుంది అనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున రీసెంట్‌ కెరీర్‌లో ‘సోగ్గాడే..’నే మంచి వసూళ్లు అందుకున్న చిత్రం. ఆ రోజుల్లోనే ₹ 50 కోట్లకుపైగా వసూలు చేసింది అంటారు. అలాంటి సినిమాకు సీక్వెల్‌/ ప్రీక్వెల్‌ ఏదైనా ఆసక్తే. అందుకే ఇప్పుడు ‘బంగార్రాజు’ మీద ఇంట్రెస్ట్‌, అలాగే వస్తుందంటున్న సీక్వెల్‌ మీద కూడా ఆసక్తి రేగుతోంది. ఈ మాట నాగ్‌ని అడిగితే… చూద్దాం అనే రేంజీలో సమాధానం ఇచ్చారు.

మందు ‘బంగార్రాజు’ సినిమా రానివ్వండి.. ఆ సినిమా రిజ‌ల్ట్ బ‌ట్టి అప్పుడు చూద్దాం అని అన్నారు నాగార్జున. అలా ఎందుకు అన్నారు అనేది కాసేపు పక్కన పెడితే… ఈ సినిమా దర్శకుడు క‌ల్యాణ్ కృష్ణ‌కి.. ‘సోగ్గాడే…’కి సీక్వెల్ చేయాల‌ని ఉందని సమాచారం. గత కొన్నేళ్లుగా ఈ ఆలోచన ఆయన మనసులో ఉందట. దానికి తగ్గ లైన్‌ కూడా సిద్ధం చేస్తున్నారట. అందులో నాగార్జున, నాగ‌చైత‌న్య‌, అఖిల్ ఉంటారని అంటున్నారు. నిజానికి ‘సోగ్గాడే…’ ఫ్రాంచైజీ ప్లాన్స్‌ ఉన్నాయట.

అయితే ఇప్పుడు నాగార్జున మాటలు చూస్తుంటే… ‘బంగార్రాజు’ బాగా ఆడితేనే సీక్వెల్‌ ముందుకొస్తుంది. కాబట్టి జ‌న‌వ‌రి 14న రెండు విషయాలు తేలిపోతాయి. ఒకటి ప్రీక్వెల్‌ హిట్‌ అయ్యిందా లేదా? రెండోది సీక్వెల్‌ ఉంటుందా లేదా? అని. ఆరేళ్ల క్రితం ‘సోగ్గాడే..’ మ్యాజిక్‌ మళ్లీ జరుగుతుందా లేదా అనేది చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus