ప్రతి హీరోకి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సీనియర్ హీరో నాగార్జునకు అలాంటి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అయితే అందరూ అనుకుంటున్నట్లు అది సినిమా మాత్రం కాదట. నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ మ్యూజియం. తెలుగు సినిమాకు సంబంధించి ఓ మూవీ మ్యూజియం ఏర్పాటు చేయాలనేది నాగార్జున కల. కేవలం సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే కాకుండా.. వాటిని భద్రపరచడం కూడా మన బాధ్యత అంటున్నాడు నాగ్ ఆ బాధ్యతను తను తీసుకున్నానని..
అందరూ గర్వపడేలా మూవీ మ్యూజియం ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు. టాలీవుడ్ కు సంబంధించి ఆణిముత్యాల్లాంటి చిత్రాలను భద్రపరచడంతో పాటు.. సినిమాకు సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉండేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేస్తానని.. దానికి సంబంధించిన మొత్తం ప్లానింగ్ కూడా రెడీగా ఉందని చెప్పుకొచ్చాడు. ముందుగా తన తండ్రి ఏఎన్నార్ నటించిన సినిమాల నుండి సేకరణ మొదలుపెట్టానని చెప్పాడు. అక్కినేని నటించి కొన్ని సినిమాలు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాయని..
ఇప్పుడు వాటన్నింటినీ సేకరించామని నాగార్జున స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీను బేస్ చేసుకొని.. అధునాతన మూవీ మ్యూజియం ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికి గూగుల్ చేస్తున్నారని.. టాలీవుడ్ గొప్పదనాన్ని కూడా అలా మునివేళ్లకు అందుబాటులో ఉండేలా తీసుకొస్తానని అంటున్నాడు నాగ్.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!