నాగ్ తన సైలిష్ లుక్ వెనుక సీక్రెట్ భయపెట్టారు

టాలీవుడ్ లో నాగార్జునకు నవమన్మధుడు అనే బిరుదు ఉంది. రొమాంటిక్ హీరోగా పేరున్న నాగ్ వయసు 61ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. ఆయన జనరేషన్ హీరోలు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ వయసుకు తగ్గట్టూ కనిపిస్తుంటే నాగ్ మాత్రం ఇప్పటికీ నలభై ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తున్నాడు. ఆరోగ్యం, ఫిట్ నెస్ పై నాగార్జున తీసుకునే శ్రద్దే ఆయన యంగ్ లుక్ వెనుక రహస్యం. ఇక బిగ్ బాస్ వేదికపై హోస్ట్ గా నాగార్జున దుమ్మురేపుతున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 3ని హోస్ట్ గా నాగార్జున అదిరిపోయే రేటింగ్ తో నడుపగా, ప్రస్తుత సీజన్ నడిపించే బాధ్యత కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. శని, ఆదివారాలలో బిగ్ బాస్ వేదికపై నాగ్ ఎనర్జీ ప్రేక్షకులలో ఫుల్ జోష్ నింపుతుంది. ముఖ్యంగా నాగార్జున లుక్ చాల స్పెషల్ గా ఉంటుంది. నాగార్జున కాస్ట్యూమ్స్ ట్రెండీగా ఉంటూ చాలా స్టైలిష్ అప్పీరెన్స్ ఇస్తున్నాయి. ఐతే నాగార్జున అద్భుత కాస్ట్యూమ్ వెనుక ప్రముఖ డిజైనర్స్ కృషి వుంది.

తన కోసం అదిరిపోయే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన డిజైనర్స్ ని నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పల్లవి సింగ్, మనీష్ మల్హోత్రా, మనోజ్ఞ ఆవునూర్ వంటి ప్రముఖ డిజైనర్స్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారట. ఇక బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా మూడవవారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ వారానికి గాను మెహబూబ్ , హారిక, దేవి నాగవల్లి, లాస్య, కుమార్ సాయి, మోనాల్, ఆరియానా నామినేట్ కావడం జరిగింది.

2

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus