Nagarjuna: నాగార్జున పాత్ర నిడివి అంత తక్కువా..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలామంది హీరోలు హిందీ మార్కెట్ పై తెగ ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున మాత్రం కొన్నేళ్ల క్రితం హిందీలో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకొని సత్తా చాటారు. అయితే బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినా నాగార్జున మాత్రం టాలీవుడ్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం నాగ్ బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మాట్లాడిన నాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2002 సంవత్సరం తర్వాత బాలీవుడ్ వైపు చూడని నాగ్ ఈ సినిమాలో కేవలం 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని అయితే నాగార్జున పాత్ర సినిమాలో కీలకమని సమాచారం. నాగార్జున మాట్లాడుతూ 5వేల సంవత్సరాల క్రితం జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిపారు. మైథాలజీ జానర్ లో సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని ఈ మూవీతో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒక కొత్త లోకంలోకి తీసుకెళుతున్నారని నాగార్జున అన్నారు. రామాయణం, మహాభారతం అంటే తనకు ఎంతో ఇష్టమని నాగార్జున పేర్కొన్నారు.

మైథాలజీ జానర్ ఇష్టం కాబట్టే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నాగార్జున వెల్లడించారు. రణబీర్ కపూర్, అలియా భట్ చాలా మంచి నటులని నాగార్జున పేర్కొన్నారు. ఇద్దరూ మంచి ఎనర్జీ ఉన్న నటులని నాగార్జున తెలిపారు. రణబీర్, అలియా లాంటి వ్యక్తులు ఉంటే తాను ఎక్కువ ఉత్సాహంగా పని చేస్తానని నాగ్ వెల్లడించారు. బ్రహ్మాస్త్ర సినిమా గురించి చెప్పి నాగ్ ఆ సినిమాపై అంచనాలను పెంచారని చెప్పాలి.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus