Bigg Boss 7 Telugu: శోభాకి , యావర్ కి పగిలింది..! వీకండ్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.,!

బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ ప్రోమో కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే, ఈవారం అమర్ చేసిన బిహేవియర్, పల్లవి ప్రశాంత్ చేసిన కంప్లైట్ రెండు కూడా నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు. సిట్యువేషన్ ని ఎలా డీల్ చేస్తారు అన్నది అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక ప్రోమోలో అయితే నాగార్జున శోభాతో యావర్ తో ఒక ఆట ఆడుకున్నారు. శోభాశెట్టి బాల్స్ గేమ్ లో యావర్ ని గట్టిగా కొట్టావ్ అని నిందవేశావని అడిగితే, లేదుసార్ నేను చేయలేదు సార్ ఆ మాట డ్యామ్ ష్యూర్ గా నేను అనలేదు సార్ అంటూ మాట్లాడింది.

దీంతో నాగార్జున వీడియో చూపించారు. అందులో శోభాశెట్టి గట్టిగా నా దగ్గరకి వచ్చి కొట్టావ్ అన్నది. అడ్డంగా దొరికిపోయింది. దీనికి సమాధానం చెప్పలేక ఏడుపు మొదలుపెట్టింది. అంతేకాదు, వీకండ్ నాగార్జునతో తేల్చుకోకపోతే నా పేరు శోభాశెట్టినే కాదు అంటూ ఛాలెంజ్ చేశావ్ కదా.. ఏంటది అంటూ నాగార్జున నిలదీశారు. దీనికి శివాజీ గురించి గ్రూప్ గేమ్ ఆడుతున్నామని, పార్షియాలిటీ చూపిస్తున్నామని పదే పదే అంటున్నారు అన్నట్లుగా మాట్లాడింది శోభాశెట్టి. దీంతో శోభాకి ఫుల్ క్లాస్ పీకారు నాగార్జున. బాల్స్ గేమ్ లో ప్రియాంకని ఎందుకు ఎంకరేజ్ చేశావ్ అని అడిగారు. దానికి బిగ్బాస్ ఫన్ టాస్క్ అని చెప్పారని కవర్ చేయబోయింది.

సంచాలక్ అంటే ఒకరి తరపున చేసేవాళ్లు కాదు కదా అంటూ శోబాశెట్టికి ఫుల్ క్లాస్ పీకడం మొదలు పెట్టారు. దీంతో శోభాకి మాటల్లేవ్. ఆ తర్వాత యావర్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు హోస్ట్ నాగార్జున. యావర్ మాట్లాడుతుంటే ఛీ..థూ అంటూ తను చేసినదాన్ని రిపీట్ చేశారు. ఇలా ఛీ..థూ అంటుంటే నీకు ఎలా ఉంది అని అడిగారు. దానికి యావర్ నేను ఆ అమ్మాయిని అనలేదు, గేమ్ లో అలా అనుకున్నానని కవర్ చేయబోయాడు. దానికి వీడియో వేసి మరీ చూపించారు. ఇలా అంటుంటే, యావర్ రియల్ క్యారెక్టర్ ఇదే అని మాకు అర్ధం అవుతుందంటూ నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు.

దానికి యావర్ ఇంకేదో మాట్లాడుబోతుంటే.. యావర్ నువ్వు చేసింది రాంగ్.. అంటూ సీరియస్ గా అరిచారు నాగార్జున. ఇప్పుడు ఈ ప్రోమో బిగ్ బాస్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు పల్లవి ప్రశాంత్ ఇంకా అమర్ విషయంలో నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. వీకెండ్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే., అమర్ దీప్ కి, శివాజీకి అలాగే పల్లవి ప్రశాంత్ ముగ్గురికీ కూడా ఫుల్ క్లాస్ పీకినట్లుగా సమాచారం తెలుస్తోంది. అమర్ దీప్ కొరికితే నీకు రక్తం వచ్చిందా.. గాయం అయ్యిందా ఏది చూపించంటూ నాగార్జున పల్లవి ప్రశాంత్ కి కూడా క్లాస్ పీకారు.

అవతల వ్యక్తిని రెచ్చగొడుతున్నట్లుగా మాట్లాడావ్.. నువ్వు చేసింది ఏంటనేది పల్లవి ప్రశాంత్ కి కూడా క్లాస్ పీకారు. అలాగే, శివాజీ ఆడపిల్లల గురించి అలా అనొచ్చా ? ఎంత వరెస్ట్ గేమ్ ఆడినా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఫుల్ క్లాస్ పీకారు. అలాగే, అమర్ దీప్ కి కొరికినందుకు, మెడికల్ రూమ్ కి తీస్కుని వెళ్లేటపుడు పల్లవి ప్రశాంత్ తో బిహేవ్ చేసిన తీరుని చూపించి పిచ్చకోపంతో క్లాస్ పీకినట్లుగా సమాచారం తెలుస్తోంది. అలాగే, ఫుల్ వార్నింగ్ ఇస్తూ ఎల్లోకార్డ్ చూపించారని టాక్. మరి ఈ వీకెండ్ ఎపిసోడ్ (Bigg Boss 7 Telugu) ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus