బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ సండే ఎపిసోడ్ మండిపోయింది. నాగార్జున హౌస్ మేట్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు. చాలా స్టైలిష్ గా యాంకరింగ్ చేస్తూ రెచ్చిపోయాడు. ముఖ్యంగా హౌస్ మేట్స్ జంటల ఫ్లాగ్స్ ని విరగ్గొడుతూ వాళ్లు చేసిన మిస్టేక్స్ ని వాళ్లచేతే చెప్పించాడు. కెప్టెన్ గా , సంచాలక్ గా అషూ ఎలాంటి నిర్ణయాలు తీస్కుంది ? ఎలా తన గేమ్ ని తానే పాడుచేసుకుందో చెప్పాడు. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ కి ఇంకా యాంకర్ శివకి కిస్కా ఇచ్చాడు.
ఇద్దరూ పెయిర్ గా బాగా ఆడారు కానీ, ఒకరికి తెలియకుండా ఇంకొకరు చేసిన పని ఇదే అంటూ వీడియోలు చూపించాడు. నటరాజ్ మాస్టర్ వాష్ రూమ్ కి ఇబ్బంది పడుతుంటే, బాత్రూమ్ కి శివ ఈల వేసుకుంటూ వెళ్లే వీడియో చూపించాడు. ఇది ఫెయిర్ గేమ్ అంటారా చెప్పండి అంటూ నిలదీశాడు. ఆ తర్వాత మిత్రా ఇంకా మహేష్ విట్టాలకి కూడా గట్టి క్లాస్ పడింది. అసలు కిచెన్ డిపార్ట్ మెంట్ అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి. మరి అందరికీ ఫుడ్ ఎలా వెళ్లింది చెప్పమంటూ నిలదీశాడు.
దీంతో మిత్రాశర్మా , మహేష్ విట్టా ఇద్దరూ సూప్ లో పడ్డారు. మీరు చాలా అన్ ఫెయిర్ గేమ్ ఆడారని, పైగా మహేష్ విట్టా నీతులు చెప్పాడని మాట్లాడారు. నిన్నటి పాసెస్ ఈరోజు యాక్సెస్ చేయకూడదు అనేది మంచి పాయింటే, కానీ మీరు చేసింది ఏంటి అసలు పాస్ లే లేకుండా ఫుడ్ పాస్ చేశారు కదా అంటూ మండిపడ్డాడు. అలాగే, అనిల్ – హమీదాలు నిజంగా ఫెయిర్ గేమ్ ఆడారా అంటూ మాట్లాడాడు. అనిల్ రింగ్ లో నుంచీ బయటకి వెళ్లిపోయింది చూపించాడు.
అలాగే, ఫ్లాగ్ గేమ్స్ ఆడేటపుడు రింగ్ ఎవరు ఎవరు దాటారో క్లియర్ గా చూపించాడు. అసలు సంచాలక్ గేమ్ లో డిస్ క్వాలిఫై చేయాల్సిన వాళ్లు ఎవరో చూపించాడు నాగార్జున. దీంతో సంచాలక్ అండ్ కెప్టెన్ అయిన అషూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అరియానా , అనిల్ జంటని వాష్ రూమ్ యాక్సెస్ కోసం అంత గొడవ చేశారని, కానీ చివరకి మీరు కూడా ఫుడ్ కూపన్ లేకుండా ఫుడ్ తిన్నారని నిలదీశాడు. ఇక బిందు ఇంకా అఖిల్ జంటని పొగుడుతూనే మీరు కూడా అన్ ఫెయిర్ గేమ్ ఆడారని నిరూపించాడు.
రెండు యాక్సెస్ లు ఉండి కూడా గేమ్ లో మళ్లీ జీరో అయిపోయారంటూ చెప్పాడు కింగ్ నాగార్జున. హౌస్ మేట్స్ అందరికీ చాలా క్లాస్ గా క్లాస్ పీకాడు. గేమ్ లో , ఛాలెంజస్ వచ్చినపుడు అందరూ అన్ ఫెయిర్ గేమ్ ఆడారని, హౌస్ మేట్స్ అన్ ఫెయిర్ ఆడుతూ వరెస్ట్ అని అషూని అన్నారని చెప్పాడు. అందుకే, హౌస్ మేట్స్ అందరికీ గట్టిగా క్లాస్ పడింది.మరోవైపు డాక్టర్ పేషెంట్ గేమ్ ఆడిస్తూ ఫన్ చేశాడు నాగార్జున.
ఇక్కడే హౌస్ మేట్స్ కి కొన్ని నామినేషన్స్ కి పాయింట్స్ కూడా వచ్చాయి. ఎలిమినేషన్ లో భాగంగా మహేష్ విట్టాని ఎలిమినేట్ చేశారు. అన్ అఫీషియల్ పోలింగ్స్ లో చూసినట్లయితే మహేష్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. కానీ, అఫీషియల్ గా మాత్రం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మరి నామినేషన్స్ లో ఈసారి ఎవరుంటారు. ఈవారం ఎవరికి డేంజర్ అవుతుందనేది ఆసక్తికరం. అదీ మేటర్.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!