Revanth: రేవంత్ పై సీరియస్ అయిన నాగార్జున..! కావాలనే అలా చెప్పారా..?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం హోస్ట్ నాగార్జున ఎపిసోడ్ ఆడియన్స్ కి మంచి మజాని ఇచ్చింది. ముఖ్యంగా గీతుకి నాగార్జున ఇచ్చిన క్లాస్ ని బాగా ఎంజాయ్ చేశారు. గీతుకి అలా గట్టిగా క్లాస్ పడాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. ప్రోమో రిలీజ్ అవ్వగానే నెటిజన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఇదే వేడిలో నాగార్జున రేవంత్ గేమ్ ని కూడా చూపించారు. చేపల టాస్క్ లో మిగతా హౌస్ మేట్స్ ని ఎలా తోసుకుంటూ గేమ్ ఆడాడో చూపించాడు. ముఖ్యంగా కీర్తి, ఇంకా గీతు ఇద్దరినీ తోసేసి మరీ చేపలని కలక్ట్ చేసుకున్నాడు. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు.

ఈవిడియోని స్లో మోషన్ లో చూపించి రేవంత్ ని హెచ్చరించారు. నువ్వు కావాలని తోయలేదని, గేమ్ ఆడేటపుడు ఉన్మాదిలా ఆడుతున్నావని చెప్పాడు. దీంతో రేవంత్ తన గేమ్ ఎలా ఉందో చూసుకున్నాడు. నిజానికి రేవంత్ అండ్ ఇనయ టీమ్ ఎక్కువ చేపలని కలక్ట్ చేసింది. వాళ్ల గేమ్ ని అఫ్రిషియేట్ చేస్తూనే కావాలనే రేవంత్ కి ఈ వీడియో చూపించారా అనిపిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం రేవంత్ అందరికంటే టాప్ లో ఉన్నాడు. మరికొన్ని వారాలు మాత్రమే ఈ షో ఉంది కాబట్టి, ఇప్పుడు ఎలాంటి తప్పు చేసినా వేరేవాళ్లకి ఛాన్స్ ఇచ్చినట్లుగా అవుతుంది.

అందుకే, రేవంత్ ని హెచ్చరించారని బిగ్ బాస్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. తర్వాత ఆర్జే సూర్యని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేశాడు హోస్ట్ నాగార్జున. ఏం జరిగిందంటే., నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేద్దామని చెప్పిన నాగార్జున హౌస్ మేట్స్ అందరూ లేచి నుంచోమని చెప్పాడు. ఈసారి హౌస్ మొత్తం నామినేషన్స్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా నేను ఎలిమినేషన్ ఎవరు అవుతున్నారో చెప్తానని అన్నాడు. దీంతో నాగార్జున సూర్య పేరుని ఎనౌన్స్ చేశారు. హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.

అందరూ ఆశ్చర్యంగా ఆర్జే సూర్యకి వీడ్కోలు చెప్పారు. ఇనయ అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఆర్జేసూర్యకి ముద్దులు పెట్టింది. అత్యంత నాటకీయంగా జరిగిన ఈ ఎలిమినేషన్ తో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. సూర్య స్టేజ్ పైకి ఆదివారం ఎపిసోడ్ లో కనిపించబోతున్నాడు. ఆర్జే సూర్య 8వారాల గేమ్ జెర్నీని చూడబోతున్నాడు. ఇంట్లో అమ్మాయిలకి మంచి ఫ్రెండ్ గా ఉన్న సూర్య వెళ్లిపోతుంటే, ఫైమా, కీర్తి, వాసంతీ అందరూ బాధపడ్డారు.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus