Nagarjuna,Rajamouli: జక్కన్నతో సినిమాపై నాగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఈ డైరెక్టర్ కు క్రేజ్ పెరుగుతుండగా ఈ డైరెక్టర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే సీనియర్ స్టార్ హీరోలతో కూడా రాజమౌళి సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. రాజమౌళితో సినిమా గురించి నాగార్జునకు ప్రశ్న ఎదురు కాగా నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళితో సమయం వస్తే సినిమా సాధ్యమేనని ఆయన అన్నారు. నాతో సినిమా తెరకెక్కించడం గురించి జక్కన్నను తరచూ అడుగుతూ ఉంటానని నాగ్ చెప్పుకొచ్చారు. ఆ ప్రశ్న అడిగిన ప్రతి సందర్భంలో చిరునవ్వు నాకు సమాధానంగా వస్తుందని నాగ్ చెప్పుకొచ్చారు. రాజమౌళి కథను నమ్మే దర్శకుడని నాగ్ తెలిపారు. రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత అందుకు అనుగుణంగా నటీనటులను ఎంచుకుంటారని నాగ్ చెప్పుకొచ్చారు. అలాంటి సమయం ఎప్పుడొస్తుందో అప్పుడే మా కలయిక సాధ్యమవుతుందని నాగార్జున తెలిపారు.

మరి ఆరోజు కోసం వేచి చూడాలంటూ నాగ్ కామెంట్లు చేశారు. నాగ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాగ్ తో సినిమాపై రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే రాబోయే రోజుల్లో నాగ్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జున కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దసరా పండుగ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా సక్సెస్ ను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా అదే రోజు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus