బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే సీజన్ సిక్స్ కార్యక్రమం కూడా ప్రసారం కావడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం తదుపరి సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఇకపోతే సీజన్ సిక్స్ కార్యక్రమానికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసిపోయింది. ఈ కార్యక్రమం మొదట్లో నాగార్జున హోస్ట్ గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని ఆయన స్థానంలో సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలిసిపోయింది.
ఇకపోతే ఈ కార్యక్రమం కోసం నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత సీజన్ 5 కోసం నాగార్జున ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సీజన్ కోసం నాగార్జున మరింత రెమ్యూనరేషన్ పెంచారని సమాచారం. ఈ సీజన్ కోసం సుమారు 14 నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ విధంగా నాగార్జున రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేదు. అయితే త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.ఇకపోతే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?