Nagarjuna: నాగ్ ధరించిన ఈ స్వెట్ టీషర్ట్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

స్టార్ హీరో నాగార్జున ఒకవైపు సినిమాలతో మరోవైపు రియాలిటీ షోలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు ఉండకపోవచ్చని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బిగ్ బాస్ సీజన్7 హోస్ట్ గా నాగ్ ప్రశంసలు అందుకుంటుండగా కొన్ని విషయాలకు సంబంధించి మాత్రం ఆయనపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాగార్జున స్పెషల్ స్వెట్ టీషర్ట్ లో కనిపించగా అమర్ దీప్ టీ షర్ట్ చాలా బాగుందని నాకు ఇస్తారా సార్ అని అడగడం జరిగింది.

నాగార్జున వెంటనే ఇస్తానంటూ సరదాగా బదులివ్వడం జరిగింది. అయితే నాగ్ ధరించిన ఈ టీషర్ట్ ధర 2,11,190 రూపాయలు అని తెలిసి అభిమానులు సైతం ఒకింత షాకవుతున్నారు. buyma.us వెబ్ సైట్ ద్వారా ఈ స్వెట్ టీషర్ట్ ను కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంది. (Nagarjuna) నాగార్జున ప్రతివారం తన క్యాస్టూమ్స్ ద్వారా వార్తల్లో నిలుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఈ నెల 17వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విజేత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకనుంది. బిగ్ బాస్ షో అభిమానులు సైతం విన్నర్ ఎవరవుతారో ఊహించలేకపోతున్నారు. బిగ్ బాస్ సీజన్7 ముగుస్తుండటం బిగ్ బాస్ షో అభిమానులను ఒకింత షాక్ కు గురి చేస్తోంది. ఈ సీజన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తారని ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజం కాకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో సీజన్7 హిట్ సీజన్ గా నిలవడం ఈ షో ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. నాగ్ బిగ్ బాస్ షోను సక్సెస్ చేసినట్టే నా సామిరంగ సినిమాను సైతం సక్సెస్ చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus