ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న రెండు బయోపిక్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అందులో ఒకటి మహానటి సావిత్రి జీవిత గాథ అయితే.. మరొకటి మహానటుడు నందమూరు తారక రామారావు బయోపిక్. ఈ రెండూ వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ జాబితాలోకి మరో మూవీ చేరింది. అదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్. తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్న సమయంలో పాదయాత్ర చేసి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పాలించిన పేదల నాయకుడు వైఎస్సార్ మీద సినిమా అనగానే క్రేజ్ ఏర్పడింది.
“చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నప్పుడు మొదలుపెట్టి ఆ టైంలో అంతర్గత పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని ఒక తాటిపైకి తీసుకొచ్చి తన నాయకత్వ సమర్ధతతో అధికారంలోకి ఎలా తీసుకొచ్చారు ఎలాంటి సమస్యలు – ఇబ్బందులు ఎదురుకున్నారు అనే దాని మీద కథ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాలో మొదట మమ్ముట్టిని నటింపచేయించాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ నాగార్జున వద్దకు వెళ్లిందని తెలిసింది. నాగ్ టైటిల్ రోల్ పోషించేందుకు ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అయితే స్క్రిప్ట్ ని మరింత పక్కాగా చేసుకొని రమ్మని డైరక్టర్ కి చెప్పిన్నట్టు టాక్. మరి ఈ సినిమా డైరక్టర్, నిర్మాత ఎవరు అనేది.. త్వరలోనే బయటికి రానుంది. ప్రస్తుతం నాగార్జున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు.