Nagarjuna, Chiranjeevi: చిరుతో పోటీ.. అంతా కావాలనే..?

అక్టోబర్ 5న రెండు పెద్ద సినిమాలు పోటీ పడడానికి రెడీ అవుతున్నాయి. అవేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలు. ఈ ఇద్దరూ సీనియర్ హీరోలే. పైగా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అలాంటిది ఒకేసారి ఈ ఇద్దరూ పోటీకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. అసలే ఈ మధ్యకాలంలో చిరు, నాగార్జునలకు సరైన హిట్టు పడలేదు. ఇలాంటి సమయంలో ఇద్దరూ ఒకేసారి పోటీ పడడమనేది ఆలోచించాల్సిన విషయం.

నిజానికి నిర్మాతల మధ్య డిస్కషన్స్ జరిగినప్పుడు నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాను దసరా కంటే వారం ముందు విడుదల చేయాలని అనుకున్నారు. దాంతో మెగాస్టార్ సినిమాను దసరా డేట్ కు ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇంతలో ఏం జరిగిందో కానీ ‘ది ఘోస్ట్’ డేట్ కూడా మారి అదే డేట్ కి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 5 డేట్ ను నాగార్జున స్వయంగా ఎన్నుకున్నారట. ఆ డేట్ తో ఆయనకున్న రిలేషన్ ఏంటో తెలియదు కానీ మెగాస్టార్ తో పోటీ పడడానికి రెడీ అయ్యారు.

ఈ రెండు సినిమాలతో పాటు బెల్లంకొండ చిన్న కొడుకు గణేష్ నటించిన డెబ్యూ ఫిలిం ‘స్వాతిముత్యం’ కూడా ఇదే డేట్ కి విడుదల కాబోతుంది. సితార సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అక్టోబర్ నాటికి వేరే పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ మూడు సినిమాలకు థియేటర్ల సమస్య ఉండకపోవచ్చు. కానీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి!

ఇక ఈరోజు నాగార్జున పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయన్ను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో ఆయనకు అందరికీ థాంక్స్ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది!

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus