Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

‘వేట్టయన్’ (Vettaiyan) తర్వాత రజినీకాంత్ (Rajinikanth) హీరోగా రూపొందుతున్న సినిమా ‘కూలీ'(Coolie) . లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాకు దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో లోకేష్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్. ఇంకో రకంగా చెప్పాలంటే అట్లీ కంటే లోకేష్ కే కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ హీరోలంతా లోకేష్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి (Prabhas) లోకేష్… ఓ కథ చెప్పడం.. దానికి డార్లింగ్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయింది అనే టాక్ కూడా కొన్నాళ్లుగా వినిపిస్తుంది.

Nagarjuna

మాస్ సినిమాని ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా చెప్పడం అన్నది లోకేష్ స్టైల్. అందుకే ‘జైలర్'(Jailer) పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రజినీకాంత్ మాత్రమే కాదు కన్నడ, మలయాళ స్టార్లు కూడా నటిస్తున్నారు. టాలీవుడ్ నుండి కింగ్ నాగార్జున ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కూలీ’ లో నాగార్జున (Nagarjuna) సైమన్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారట. గ్రే షేడ్స్ కలిగిన ఈ పాత్రని లోకేష్ చాలా బాగా డిజైన్ చేశాడట.

ఒక రకంగా చెప్పాలంటే రజినీకాంత్ కంటే కూడా నాగార్జున రోల్ చాలా బాగా వచ్చింది అని వినికిడి. సినిమాలో నాగార్జున వచ్చే ప్రతి సీన్ కి విజిల్స్ ఓ రేంజ్లో పడతాయట. టాలీవుడ్లో మాస్ హీరోలు ఉన్నప్పటికీ… నాగార్జునకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు.కాకపోతే నాగార్జున ఇమేజ్ కి తగ్గ మాస్ రోల్ డిజైన్ చేయలేక.. ఇక్కడి దర్శకులు అతనికి భారీ డిజాస్టర్లు ఇచ్చారు.’ ‘కూలీ’ చూశాక వాళ్లంతా పశ్చాత్త పడతారు’ అని ఇండస్ట్రీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. చూద్దాం వారి కామెంట్స్ లో ఎంతవరకు నిజముందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus