దర్శకుల విషయంలో నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు తీసుకున్నసంచలన నిర్ణయం ఏ సంవత్సరంలో అంటే..

స్టార్ హీరోలు సినిమా సినిమాకీ కథ, క్యారెక్టర్స్ పరంగా డిఫరెన్స్ చూపిస్తేనేే కానీ ప్రేక్షకాభిమానులను అలరించడం కష్టం.. ఎప్పుడూ రెగ్యులర్ అండ్ రొటీన్ ఫార్మాట్ మూవీస్ చేస్తే కష్టమే.. అలా రొట్ట కొట్టుడు సినిమాలు చేసిన ప్రతి సారీ ఫలితాలు తారుమారయ్యాయి.. మారుతున్న కాలంతో పాటు, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతుంటాయి కాబట్టి కొత్త జానర్‌లో సినిమాలు చేయాల్సిందే.. అలా ఒక ఏడాదిలోనే నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు వంటి ముగ్గురు హీరోలకు జ్ఞానోదయం అయినట్టుంది..

తమ తర్వాతి చిత్రాలు, వాటి దర్శకుల విషయంలో 2007వ సంవత్సరం డిసెంబర్‌లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.. ఆ వివరాలేంటో చూద్దాం.. నాగార్జున హీరోగా నటిస్తూ, నిర్మించిన ‘మాస్’ మూవీ హిట్ అయింది.. స్టార్ కొరియోగ్రాఫర్ లారెన్స్‌ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు.. తర్వాత ‘డాన్’ మూవీ చేశారు కానీ సెకండ్ టైం వర్కౌట్ కాలేదు.. దాంతో యాక్షన్ కాకుండా గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ గంగరాజు మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు..

ఫస్ట్ సినిమా ‘భద్ర’ తో హిట్ కొట్టిన బోయపాటి శ్రీను రెండో సినిమాగా వెంకటేష్ హీరోగా ‘తులసి’ చేశాడు.. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకీని ఆ క్యారెక్టర్‌లో ఊహించుకోలేక పోయారు ఆడియన్స్.. దీంతో తర్వాత ఇలాంటివి కాకుండా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేస్తున్నట్లు, అప్పటికి కథ రెడీ అవుతున్నట్టు వెంకీ చెప్పారు.. బహుశా అది రానా ఫస్ట్ ఫిలిం ‘లీడర్’ కథే కావచ్చు..

ఇక మహేష్ బాబు కూడా సురేందర్ రెడ్డితో ‘అతిథి’ అనే స్టైలిష్ యాక్షన్ ఫిలిం చేశాడు కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది.. నాగ్, వెంకీలానే సాఫ్ట్ సినిమా చేయాలనుకున్నాడు. నెక్స్ట్ సినిమా ‘బొమ్మరిల్లు’ భాస్కర్, శేఖర్ కమ్ములతో చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితుల వద్ద చెప్పినట్టు వార్తలు వచ్చాయి.. అలా యాక్షన్ సినిమాలతో మారణ హోమం సృష్టించిన స్టార్స్ సాఫ్ట్ మూవీస్ చేయాలనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus