కొన్ని సంవత్సరాల క్రితం వరకు నాగార్జున వరుస విజయాలను సొంతం చేసుకుని యంగ్ జనరేషన్ హీరోలకు సైతం షాకిచ్చారు. నాగ్ నటించిన సినిమాలలో ఒకటైన సోగ్గాడే చిన్నినాయన సినిమా కేవలం 9 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా 45 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. నాగ్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పవచ్చు.
నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
వేర్వేరు కారణాల వల్ల క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదు. నాగార్జున మార్కెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు చాలా తక్కువ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా విడుదలైన వారం రోజులకే వకీల్ సాబ్ సినిమా విడుదల కావడం కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది. అయితే థియేటర్లలో ఫ్లాపైన ఈ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచింది.
గత నెల 5వ తేదీన నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఇతర సినిమాలతో పోటీ వల్ల ది ఘోస్ట్ మూవీకి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మరీ సీరియస్ మూవీ కావడం కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీలో ఈ సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుండగా నెట్ ఫ్లిక్స్ లో ది ఘోస్ట్ టాప్1 స్థానంలో కొనసాగుతూ ఉండటంపై నాగ్ సంతోషం వ్యక్తం చేశారు. నాగార్జున నటించిన ప్రయోగాత్మక సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అవుతున్నా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. నాగార్జున సైతం భవిష్యత్తులో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!