Nagarjuna: ‘ది ఘోస్ట్’ మూవీ పై ఆ రూమర్స్ నిజమేనా?

‘కింగ్’ నాగార్జున హీరోగా ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఘోస్ట్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటిస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున ‘రా’ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. విక్రమ్ గాంధీ అనే పాత్రలో నాగ్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నిజానికి ఈ చిత్రం కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో యాక్షన్ సన్నివేశాలు చేయడం కరెక్ట్ కాదు అని ఆమె తప్పుకుంది. ఈ చిత్రం ఎక్కువ శాతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉండగా .. ‘ది ఘోస్ట్’ చిత్రం గురించి ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే.. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ టాక్. నెట్ ఫ్లిక్స్ నుండి ఈ చిత్రానికి భారీ ఆఫర్ వచ్చిందట.

దీంతో చర్చలు మొదలయ్యాయి అని తెలుస్తుంది. నాగార్జున కెరీర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీ ఇది. మరి అలాంటప్పుడు ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేస్తారు అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. మొదట్లో టికెట్ రేట్లు అని అంతా అనుకున్నారు. తర్వాత ఓటీటీలో త్వరగా స్ట్రీమింగ్ అవ్వడం వలన అనుకున్నారు. వాటికి పరిష్కారం కూడా ఆలోచించి టికెట్ రేట్లు తగ్గించడం, ఓటీటీలో 50 రోజుల వరకు సినిమాలు రిలీజ్ చేయమంటూ ప్రమోషన్లు చేసుకుంటున్నా కానీ జనాలు థియేటర్లకు రావడం లేదు.

అందుకే ‘నాగార్జున మూవీ టీం ఈ నిర్ణయం తీసుకున్నారా?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారిక ప్రకటన రాకుండా ఏదీ కన్ఫర్మ్ చేయలేము. రేపు ఉదయం 11 గంటలకు ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో నిర్మాతలు ప్రకటించారు. మరి ఆ అప్డేట్ ఏంటో చూడాలి..!

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus