Trivikram: త్రివిక్రమ్ అలా చెప్పలేదు కానీ.. పాయింట్ మాత్రం కరెక్టే!

ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే సినిమా టికెట్స్ ను అమ్మాల్సి ఉంటుందని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్స్ ను అమ్మాలని సినిమాటోగ్ర‌ఫీ చట్టాల్లో సవరణలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తబరుస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ట్విట్టర్ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. అందులో ఏముందంటే.. ”చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక‌టే టికెట్ రేటు అన్న‌ట్లు..

ప్ర‌తి స్కూల్‌లో ఒక‌టే ఫీజు, ప్ర‌తి హాస్పిట‌ల్‌లోనూ ఒక‌టే బిల్లు ఎందుకు పెట్ట‌రు? పేదవాడికి విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా?” అని రాసి ఉంది. ఈ ట్వీట్ వైరల్ అవ్వగా.. పేర్ని నాని కూడా మీడియా ముందు దీని గురించి మాట్లాడారు. ఈ ట్వీట్‌ను తాను ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ‌తాన‌ని చెప్పారు. అయితే నిజానికి ఆ ట్వీట్ త్రివిక్రమ్ పెట్టలేదట. అసలు త్రివిక్రమ్ కి ట్విట్టర్ లో అకౌంట్ కూడా లేదు. ఇదే విషయంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

త్రివిక్రమ్ గారి నుంచి వచ్చే అధికార ప్రకటన ఏదైనా సరే.. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఫార్‌ట్చూన్ ఫ‌ర్ సినిమా నుంచే వ‌స్తుందని.. ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో అకౌంట్ లేదని చెప్పారు. ఆయ‌న పేరుతోనో, ఫొటోనో ఉన్న ఇత‌ర అకౌంట్స్ నుంచి వ‌చ్చే కామెంట్స్‌ను ప‌ట్టించుకోవ‌ద్దని వెల్లడించారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus