Mahesh Babu, Trivikram: ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్స్ అందించలేము.. నాగ వంశీ ట్వీట్ వైరల్!

  • June 11, 2022 / 03:07 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని చేయనున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం షూటింగ్ పనులను ప్రారంభిస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఈ సినిమా మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుకి కథ వినిపించడంతో మహేష్ బాబు సలహా మేరకు సెకండ్ హాఫ్ లో పలు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ మరి కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది.ఇలా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలిసినప్పటికీ అభిమానులు మాత్రం ఎంతో ఆతృతగా ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వండి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మహేష్ అభిమాని తన 28వ సినిమా గురించి ఏదైనా అప్డేట్ చేయండి అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విధంగా అభిమాని చేసిన ట్వీట్ కి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ స్పందించి క్లారిటీ ఇచ్చారు. అభిమానుల ఆత్రుత మేము అర్థం చేసుకోగలము ఏదైనా సరైన సమయం వచ్చినప్పుడు చెబితేనే బాగుంటుందని మేము భావిస్తున్నాము. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్స్ అందించలేమని తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా దాదాపు 12 సంవత్సరాల తర్వాత వెండితెరపై సందడి చేయనుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కటి చాలా స్పెషల్ గా ఉండాలి కాబట్టి, అలాంటి స్పెషల్ డే కోసం ఎదురుచూస్తున్నాము అంటూ తెలిపారు. కచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక అభిమానికి మరుపురాని సినిమాగా నిలుస్తుంది అంటూ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ఈ సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus