ఒక రెండేళ్ల క్రితం డ్రగ్స్ కేసులో సిట్ ఆఫీసర్స్ రోజుకొకర్ని చొప్పున పూరీ జగన్నాధ్, రవితేజ, ఛార్మీ, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, సుబ్బరాజు, నందు, తనీష్ వంటి వాళ్ళను ప్రశ్నించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వాడడం మాత్రమే కాకుండా సప్లై కూడా చేస్తున్నారని వారి మీద నిందలు కూడా మోపారు. దాదాపు 12 మంది సినిమా సెలబ్రిటీలను కొన్ని గంటలపాటు ప్రశ్నించిన సిట్ పోలీసులు ఆ తర్వాత రిపోర్ట్ ఏమీ ఇవ్వలేదు. ఎన్నో విషయాల్లానే ఈ డ్రగ్స్ కేసును కూడా మన జనాలు లైట్ తీసుకొన్నారు.
అయితే.. నిన్న ఉన్నట్లుండి సడన్ గా సిట్ వారు సబ్మిట్ చేసిన ఫైనల్ రిపోర్ట్ లో టాలీవుడ్ నుంచి అనుమానితులుగా ప్రశ్నించిన 62 మందికి క్లీన్ చిట్ ఇచ్చారని వార్త హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ విచిత్రమైన అంశం ఏమిటంటే.. నిన్న రిలీజ్ చేసిన 62 మంది క్లీన్ చిట్ అందుకున్న టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లలో సిట్ పోలీసులు ప్రశ్నించిన మన బడా సెలబ్రిటీల పేర్లు లేకపోవడం. అలాగని వాళ్ళని బాధ్యులుగా కూడా ప్రకటించలేదు. అసలు ఆ లిస్ట్ లో వాళ్ళ పేర్లే లేవు.. అంటే వాళ్ళని ప్రశ్నించింది ఊరికేనా లేక ఇంకా వారిపై అనుమానం ఉందా అనే విషయంలో క్లారిటీ రావాలి.