పర్సనల్‌ లైఫ్‌ గురించి ఓపెన్‌ అయిన నమిత

లావుగా ఉన్న హీరోయిన్లంటే దక్షిణాది సినిమా అభిమానులకు ఇష్టమనే విషయం తెలిసిందే. ఖుష్బూతో మొదలైన ఈ మందమైన ‘అందం’ కాన్సెప్ట్‌.. ఆ తర్వాత నమిత.. ఆ తర్వాత హన్సిక వరకు కొనసాగాయి. అయితే ఆ బొద్దు అందం వెనుక చాలా కష్టాలు, నష్టాలు, గాధలు, కన్నీళ్లు ఉంటాయి. కావాలని ఎవరూ లావు అవ్వరు కదా. అలా నిన్నటితరం నాయిక నమిత లావు వెనుక కూడా ఓ కథ ఉంది. ఆమె మరచిపోలేని ఆ బాధను ఇటీవల చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మానసిక ఒత్తిడిని ఎదుర్కొవడంపై అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను అంటూ సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

‘‘సుమారు తొమ్మిది, పదేళ్ల క్రితం బొద్దుగా ఉండేదాన్ని. అప్పట్లో మానసిక కుంగుబాటుకు లోనయ్యాను. ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నాననే విషయం కూడా నాకు తెలియలేదు. రాత్రిళ్లు నిద్రపోయేదాన్ని కాదు. ఈ క్రమంలో ఎక్కువగా ఆహారం తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా విపరీతంగా బరువు పెరిగిపోయాను. చూస్తుండగానే నా బరువు 97 కిలోలకు చేరింది. మద్యం తాగడం వల్లే నేను బరువు పెరిగానని అనుకుంటూ ఉంటారు కానీ అసలు విషయం వేరే ఉంది’’ అని చెప్పుకొచ్చింది నమిత.

‘‘థైరాయిడ్‌, పీసీఓడీ సమస్యల వల్లే లావుగా మారాననే విషయం నాకు మాత్రమే తెలుసు. ఈ విషయం ఇతరులకు తెలియక నేను తాగుడు వల్ల ఇలా మారిపోయా అనుకుంటున్నారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు నన్ను వేధించాయి. దాదాపు ఐదేళ్లపాటు తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యా. ఆ సమయంలో యోగాతో మనశ్శాంతి లభించింది. నాకు కావాల్సిన శాంతి మంత్రాన్ని నాలోనే కనుగొన్నాను. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను’’ అంటూ తన కుంగుబాటు గురించి చెప్పుకొచ్చింది నమిత.

1

2

3

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus