Namrata: ఎమోషనల్ అయిన నమ్రత.. మిస్ అవుతున్నానంటూ?

నమ్రతా శిరోద్కర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యి ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే గౌతమ్, సితార బాధ్యతలను, మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాలలో నమ్రత చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నమ్రత ఎన్నో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో తనపిల్లలకు సంబంధించిన అల్లరి పనుల గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈమె మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను, మహేష్ బాబు సినిమా విషయాల గురించి కూడా అభిమానులకు అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా నమ్రత కొన్నిసార్లు తన కుటుంబ సభ్యుల గురించి తన తల్లిదండ్రుల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ కాస్త ఎమోషనల్ అవుతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా తన తండ్రిని తలచుకొని నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ. నేను ఒంటరిగా నిలబడే దాన్ని కాదు… నా జీవితంలో ఓ అదృశ్య శక్తి మీరు.. మీ వల్లే నేను నిల్చున్నాను.. మీరే నా వెనుక ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. అదే తండ్రి ప్రేమ… గత 16 సంవత్సరాల నుంచి ప్రతి రోజు మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను.. నా హృదయంలో మీపై ఎప్పటికీ ప్రేమ స్థానం ఉన్నాయి.

మీరు ఎక్కడున్నా నన్ను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటారని భావిస్తున్నాను అంటూ నమ్రత తన తండ్రి నితిన్ శిరోద్కర్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నమ్రత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus