నమ్రత స్టైల్ కి సాటెవ్వరు
- December 12, 2016 / 11:26 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ మిస్ ఇండియా కిరీటం అందుకుని ఇప్పటికీ 23 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆమె అందం చెక్కు చెదరలేదు. ఇల్లాలిగా, ఇద్దరి పిల్లల తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూనే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రెండు నెలల క్రితం ఆ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరున్ని దర్శించుకొని తల నీలాలు సమర్పించుకున్నారు.
రెండు నెలలు తర్వాత ఓ ఫంక్షన్ కి హాజరై మళ్లీ మీడియా కంటికి చిక్కారు. స్మాల్ స్లీవ్డ్ టాప్, బ్లాక్ అండ్ రెడ్ గౌన్ ధరించి యువ మోడల్ గా దర్శనమిచ్చారు. తలపై లైట్ గా జుట్టు రావడంతో మరింత స్టైల్ గా కనిపించారు. సింపుల్ గా ఉంటూనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. సూపర్ మోడల్ అని నిరూపించుకున్నారు. నలభై ఏళ్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ యువకుడిలా కనిపిస్తారని మహేష్ బాబు అభినందనలు అందుకుంటుంటే, అతనికంటే మూడేళ్లు పెద్దదైన నమ్రత అందంలో ప్రిన్స్ కి పోటీ ఇస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















