Namrata Shirodkar: ‘మూమెంట్స్ ఇన్ టైం’ అంటూ క్యూట్ పిక్ షేర్ చేసిన నమ్రత.. వైరల్ అవుతున్న సితార, గౌతమ్ ఫోటో.!

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మహేష్ 28వ చిత్రమిది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో ఫిలిం చేయనున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ సతీమణి నమ్రత మహేష్ సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తమ పర్సనల్ అండ్ ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాలన్నిటినీ ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు.

అలా ఇప్పుడామె పోస్ట్ చేసిన ఓ క్యూట్ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘మూమెంట్స్ ఇన్ టైం’ అంటూ కుమార్తె సితార ఘట్టమనేని, కుమారుడు గౌతమ్ కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు నమ్రత. అన్నాచెల్లెల్ల క్యూట్ పిక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. విదేశాలకు టూర్ వెళ్లినప్పుడు తీసిన ఫోటోలా అనిపిస్తుంది. మహేష్ ఫ్యాన్స్ ఈ పిక్చర్‌ని సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus