Namrata, Sitara: సితార ఎంట్రీపై నమ్రత షాకింగ్ కామెంట్స్ వైరల్!

మహేష్ బాబు కూతురు సితార సర్కారు వారి పాట సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. పెన్నీ సాంగ్ లో సితార ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేశాయి. సితార చాలా టాలెంటెడ్ అని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సితార ఎంట్రీ విషయంలో చాలా కంగారుపడ్డామని నమ్రత అన్నారు.

Click Here To Watch NOW

సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటోందని నమ్రత వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా సితార డ్యాన్స్ వీడియోలను తరచూ షేర్ చేస్తుందని సితార కామెంట్లు చేశారు. సర్కారు వారి పాట మూవీ నుంచి మొదట కళావతి సాంగ్ రిలీజైందని ఆ సాంగ్ విడుదలైన సమయంలో కళావతి పాటకు రీల్ చేసి సోషల్ మీడియాలో సితార షేర్ చేయగా ఆ వీడియోను థమన్ చూశారని నమ్రత అన్నారు.

థమన్ మహేష్ బాబుతో పెన్నీ సాంగ్ కు సితారతో డ్యాన్స్ చేయించాలని భావిస్తున్నట్టు వెల్లడించారని మహేష్ సితారతో ఆ విషయం చెబితే సితార చాలా సంతోషిందని నమ్రత చెప్పుకొచ్చారు. సితార ఆ విధంగా ఆ పాటలో భాగమైందని నమ్రత కామెంట్లు చేశారు. తాను, మహేష్ సితార విషయంలో కంగారు పడ్డామని అనుకున్న విధంగా వీడియో రాకపోతే రిలీజ్ చేయకూడదని భావించామని నమ్రత వెల్లడించారు. అయితే సితార డ్యాన్స్ బాగా చేసిందని తన డ్యాన్స్ ద్వారా సితార మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని నమ్రత పేర్కొన్నారు.

నమ్రత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కు నాలుగు వారాల సమయం మాత్రమే ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus