Namrata: పేదల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న నమ్రత!

దివంగత సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణించినటికి సరిగ్గా ఏడాది పూర్తి అయింది. గత ఏడాది నవంబర్ 15వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కృష్ణ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇక నేడు ఆయన మొదటి వర్ధంతి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు కృష్ణ గారి వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నారు ఈ క్రమంలోనే మంజుల ఇదివరకే తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక కృష్ణ కోడలు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా తన మామయ్య మొదటి వర్ధంతి వేడుక సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృష్ణ వర్ధంతిని పురస్కరించుకొని నమ్రత ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం అలాగే బుర్రపాలెంలో పాఠశాలలను అభివృద్ధి చేయటం ఇక ఎంతోమంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడం చేశారు.

ఇలా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి మహేష్ బాబు కుటుంబ సభ్యులు కృష్ణ గారి మొదటి వర్ధంతి సందర్భంగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఎంతో టాలెంట్ కలిగి ఉండి చదువుకోలేకపోతున్నటువంటి పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలని నిర్ణయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ తీసుకుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పేద విద్యార్థులలో టాలెంట్ కలిగినటువంటి వారిని మహేష్ బాబు ఫౌండేషన్ గుర్తించి వారి చదువు బాధ్యతలు అన్నింటిని తీసుకోబోతున్నారట.

మావయ్య గారి ఆశీస్సులతో ఇప్పటికే నలుగురి విద్యార్థులను సెలెక్ట్ చేసి వారికి ఎంతవరకు చదవాలి అనిపిస్తే అంతవరకు చదివించే బాధ్యత మహేష్ బాబు ఫౌండేషన్ తీసుకుంటుందని ఇలా నలుగురితో మొదలైనటువంటి ఈ కార్యక్రమం రేపు ఎంతవరకు అయినా వెళ్ళొచ్చని ఇలా చదువుపై ఇష్టముండి చదువుకోలేకపోయిన పేదవారు ఎవరు ఉండకూడదన్న ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ నమ్రత (Namrata) వెల్లడించడంతో వీరి మంచి మనసు పై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus