Balakrishna: మీ రెస్పాన్స్ చూసి థ్రిల్ అయ్యాం.. నాగ వంశీ పోస్ట్ వైరల్!

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం సార్. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తమిళంలో వాతి పేరిట విడుదలయ్యే అక్కడ కూడా అద్భుతమైన కలెక్షన్లను సాధించింది.విద్యా వ్యవస్థ పై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించే ఓ లెక్చరర్ పాత్రలో ధనుష్ ఈ సినిమాలో నటించారు.

ఇలా విద్యా వ్యవస్థ పై కార్పొరేట్ వ్యవస్థలు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో ఈ సినిమా ద్వారా స్పష్టంగా చూపించారు.ఇలా ఈ సినిమా విద్యకు సంబంధించినది కావడంతో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు అందరిని ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి.ఇప్పటికే థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రెండు వారాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమాకు ఇప్పటికీ అదే స్థాయిలో ఆదరణ వస్తుంది. ఇక సార్ సినిమా చూసినటువంటి పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ క్రమంలోనే తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం నాగ వంశీ ప్రత్యేకంగా ఒక షో వేశారు. ఈ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలయ్య ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలపై నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మేరకు నాగ వంశీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ… సార్ సినిమా చూసి చిత్ర బృందాన్ని అభినందించిన బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.

ఈ సినిమా పట్ల మీ రెస్పాన్స్ చూసి మేము చాలా త్రిల్ అయ్యాం సర్ అంటూ బాలకృష్ణ గారితో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తారకరత్న మరణించడంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించారు. త్వరలోనే తిరిగి కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో బాలయ్య బిజీ కానున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus