జూబ్లీహిల్స్ సమీపంలో అత్యంత విలువైన ఇల్లుని కొన్న బాల‌కృష్ణ‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసాడట. హైద‌రాబాద్‌లో ఉన్న జూబ్లీహిల్స్‌ సమీపంలో ఖ‌రీదైన ఇంటిని బాలయ్య భారీ రేటు పెట్టి కొనుగోలు చేసాడని తెలుస్తుంది. 9,935 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం గల గ్రౌండ్ ఫ్లోర్‌, రెండు ఫ్లోర్‌ల‌తో కూడిన ఈ ఇంటిని రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడ‌ట బాలయ్య‌. ఇక రూ.82.5 ల‌క్ష‌లకు ఇంటి స్టాంప్ డ్యూటీ అలాగే రిజిస్ట్రేష‌న్ కు మరో రూ.7.5 ల‌క్ష‌లు బాలయ్య ఖర్చు చేసినట్టు వినికిడి. ఇప్పటికే జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 1లో బాలయ్యకు ఓ భ‌వంతి ఉందన్న సంగతి తెలిసిందే.!

ఇది మరొకటి కావడం విశేషం. ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా కీలక బాధ్యతలను నెరవేరుస్తూ బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. ప్ర‌స్తుతం ఆయన బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్‌లో ఓ మాస్ అండ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి.. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇది పూర్తయిన తరువాత బి.గోపాల్ డైరెక్షన్లో కూడా బాలయ్య ఓ సినిమా చేస్తాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. దీనికి బుర్రా సాయి మాధవ్.. కథ మరియు మాటలు అందించబోతున్నట్టు కూడా స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చాడు.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus